చారిత్రక అయోధ్య తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన 19 వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం... రివ్యూ పిటిషన్లను పరిశీలించింది. ఆ వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని తేల్చిచెప్పింది. అన్నింటినీ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదీ తీర్పు...
అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి సుప్రీం కోర్టు నవంబర్ 9న ముగింపు పలికింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిలో రామ మందిర నిర్మాణం చేపట్టాలని స్పష్టంచేసింది. మసీదు నిర్మాణానికి.. 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.