భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయిపై ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు ప్రత్యేక ప్యానెల్ అంతర్గత విచారణ చేపట్టింది. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన ప్యానెల్ ముందు ఆరోపణలు చేసిన సుప్రీం మాజీ ఉద్యోగిని హాజరయ్యారు.
కేసు వివరాల్ని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ప్యానెల్‌కు సమర్పించారు. విచారణ సమయంలో ఆరోపణలు చేసిన మహిళ ఒక్కరే ఉన్నారు. సాధారణ విచారణ కాకపోవడం వల్ల సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ను, మహిళ తరఫు న్యాయవాదిని అనుమతించలేదు. తదుపరి విచారణ తేదీని ప్యానెల్ త్వరలో ప్రకటించనుంది.
అసాధారణ రీతిలో...
సీజేఐపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఈ ఆరోపణలపై అంతర్గత విచారణ కోసం సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేసింది.
విచారణ పూర్తి చేసేందుకు గడువు ఏమీ లేదని జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ఇటీవల చెప్పారు. విచారణలో తేలిన అంశాలను రహస్యంగా ఉంచి, వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: విచారణ కమిటీ నుంచి జస్టిస్ రమణ నిష్క్రమణ