కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగం విజ్ఞప్తులను కేంద్రం పరిశీలించింది. ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ సంస్థల విజ్ఞప్తులపై డ్రగ్ కంట్రోలర్ అథారిటీ నిపుణుల బృందం చర్చించింది. అదనపు సమాచారం ఇచ్చేందుకు ఫైజర్ సంస్థ కొంత సమయం కోరింది. సీరం, భారత్ బయోటెక్ సంస్థలు అందించిన అదనపు సమాచారాన్ని నిపుణులు విశ్లేషించారు.
ఈ రెండు సంస్థలు ఇచ్చిన సమాచారం, డేటా విశ్లేషణ కొనసాగుతోందని డీసీజీఐ తెలిపింది. నిపుణుల బృందం జనవరి 1న మరోసారి భేటీ అవుతుందని తెలిపింది.