కొన్ని నెలలుగా దేశ ప్రజల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది కొవిడ్ మహమ్మారి. యావత్ దేశాన్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కొత్తగా 10,441 కరోనా కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,82,383కు చేరింది. వైరస్ ధాటికి మరో 258మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 22,253కు పెరిగింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 4,88,271మంది వైరస్‌ను జయించి డిశ్చార్జి అయ్యారు. 1,71,542 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆయా రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోందిలా..
- తమిళనాడులో కొత్తగా 5,975 మంది కరోనా బారినపడ్డారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 3,79,385కు చేరింది. కొవిడ్-19 కారణంగా మరో 97 మంది మరణించగా.. మృతుల సంఖ్య 6,517 దాటింది.
- కర్ణాటకలో కొత్తగా 5 వేల 938 మందికి కొవిడ్ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 2,77,814కు పెరిగింది. వైరస్ కారణంగా మరో 68 మంది చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 4,683కు చేరింది.
- దిల్లీలో కొత్తగా 1,450 కేసులు, 16 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశ రాజధానిలో లక్షా 61 వేల 466 మంది కరోనా బారినపడ్డారు. మరో 4 వేల 300 మంది కొవిడ్‌కు బలయ్యారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా 5,325 కరోనా కేసులు వెలుగుచూడగా.. మొత్తం బాధితుల సంఖ్య 1,87,781కి పెరిగింది. మరో 59 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 2,926కు చేరింది.
- కేరళలో మరో 1,908 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం బాధితుల సంఖ్య 58,262కు పెరిగింది.
రాష్ట్రం | మొత్తం కేసులు | మరణాలు |
రాజస్థాన్ | 69,961 | 950 |
ఒడిశా | 78,530 | 409 |
పంజాబ్ | 41,779 | 1,086 |
జమ్ముకశ్మీర్ | 32,647 | 617 |
మణిపుర్ | 5,246 | 22 |
అరుణాచల్ ప్రదేశ్ | 3,223 | 05 |
ఇదీ చదవండి: కరోనా కాలంలో ఖైదీలకు ప్రత్యేక ఆహారం