ETV Bharat / bharat

ప్రశాంతంగా 'సార్వత్రికం' ఆరో దశ పోలింగ్

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. 7 రాష్ట్రాల్లోని మొత్తం 59 లోక్​సభ స్థానాలకు ఓటింగ్​ జరుగుతుంది. 979 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10 కోట్ల 17 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

'సార్వత్రికం' ఆరో విడత పోలింగ్​ ప్రారంభం
author img

By

Published : May 12, 2019, 7:00 AM IST

Updated : May 12, 2019, 9:07 AM IST

సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్​ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు వరుసక్రమంలో బారులు దీరారు. ఆరో విడతలో భాగంగా 7 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

ఆరో విడత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 979 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 10 కోట్ల 17 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. లక్షా 13 వేల పోలింగ్​ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది.

ఉత్తర్​ప్రదేశ్​లో 14, హరియాణాలో 10, బిహార్​, మధ్యప్రదేశ్​, బంగాల్​లో 8, దిల్లీలో 7, ఝార్ఖండ్​లో 4 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 979 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10 కోట్ల 17 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

poll
'సార్వత్రికం' ఆరో విడత పోలింగ్​ ప్రారంభం

ప్రస్తుతం పోలింగ్​ జరుగుతున్న స్థానాల్లో.. 2014లో జరిగిన ఎన్నికల్లో 45 గెల్చుకుంది భాజపా. ఉత్తర్​ప్రదేశ్​లో జరుగుతున్న 14 స్థానాల్లో 13 సొంతం చేసుకుంది.

పటిష్ఠ భద్రత నడుమ...

శాంతియుత వాతావరణంలో పోలింగ్ ప్రశాంతంగా ​ జరిగేలా విస్తృత చర్యలు చేపట్టింది ఎన్నికల సంఘం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశమివ్వకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. బంగాల్​లో అల్లర్ల నేపథ్యంలో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది.

రాజధాని దిల్లీ ప్రాంతంలోని 7 లోక్​సభ స్థానాలకు ఓటింగ్​ జరుగుతుంది. ఇక్కడ 60 వేల మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు.

బరిలో ప్రముఖులు...

ఈ దశలో ముఖ్యనేతలతో పాటూ.. ప్రముఖ క్రీడాకారులు ఎన్నికల బరిలో ఉన్నారు.

  1. ఉత్తర్​ప్రదేశ్​లో సమాజ్​వాది పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్​ ఆజంగఢ్​ నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి మేనకా గాంధీ సుల్తాన్​పుర్​ నుంచి పోటీలో ఉన్నారు.
  2. దిల్లీలో భారత మాజీ క్రికెటర్​ గౌతం గంభీర్,​ ప్రొఫెషనల్​ బాక్సర్​ విజేందర్​ సింగ్​లు తొలిసారి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్​ దిగ్గజ నాయకురాలు షీలా దీక్షిత్​, కేంద్ర మంత్రి హర్షవర్ధన్​, అతిషి హస్తిన లోక్​సభ బరిలో ఉన్నారు.
  3. మధ్యప్రదేశ్​ భోపాల్​లో కాంగ్రెస్​ సీనియర్​ నేత దిగ్విజయ్​ సింగ్​, సాధ్వి ప్రజ్ఞా మధ్య పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. గుణ స్థానం నుంచి జ్యోతిరాదిత్య సింధియా భవితవ్యం తేల్చుకోనున్నారు.

ఇంకా కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్​ థోమర్​, రాధామోహన్‌ సింగ్‌, క్రిషణ్‌ పాల్‌ గుర్జార్‌, రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌లు ఆరో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఇదీ చూడండి: కన్నవారికి కుమార్తె అంతిమ సంస్కారాలు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 72 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.  RESTRICTIONS: SNTV Clients Only, NM OK, Use Within 72 Hrs
SHOTLIST: Alor Setar, Kedah, Malaysia, 10th May 2019
Kedah (yellow) Vs PKNS (orange)
First Half
1. 00:00 Teams walk  out
2. 00:05 CHANCE, Fernando Rodriguez header goes wide in the 6th minute
3. 00:21 CHANCE, Gabriel Guerra hits crossbar with free kick in the 10th minute
4. 00:32 Replay of free kick
5. 00:36 GOAL, Jonatan Bauman scores in the 16th minute for Kedah, 1-0
6. 00:53 Replay of Baumam goal
7. 00:58 GOAL, Azmeer Yusof scores an own goal in the 31st minute after Gabriel Guerra shot from inside penalty area for PKNS, 1-1
8. 01:13 Replay of Yusof own goal
Second Half
9. 01:19 CHANCE, Kpah Sherman shot goes wide in the 72nd minute for PKNS
SOURCE: Football Malaysia
DURATION: 01:29
STORYLINE:
Four-time champions Kedah booked their spot in the semifinals of the Piala FA Cup in Malaysia with a 4-2 aggregate win over PKNS of Selangor following a 1-1 draw in the second leg in Kedah, on Friday.
Kedah, which led 3-1 from the first leg, opened the scoring with a Jonatan Bauman strike in the 16th minute.
An Ameer Yusof own goal gave PKNS a draw in the second leg, though the Selangor-based team lost on aggregate.
Kedah face either Felda or Kuala Lumpur in the semifinals.
Last Updated : May 12, 2019, 9:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.