జమ్ముకశ్మీర్ శ్రీనగర్ లోక్సభ పరిధిలోని దాదాపు 90 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం సున్నాగా నమోదైంది. ఈ పార్లమెంటు పరిధిలో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలున్నాయి. సోనావర్లో 12 శాతం పోలింగ్ నమోదైంది.
ఇక్కడే జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగతా ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిదిలో కేవలం 3.3శాతం ఓటింగ్ నమోదైంది.
శ్రీనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ఫరూక్ అబ్దుల్లా రీ-పోలింగ్ జరపాలని కోరుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్లో మొత్తం 67.84 శాతం పోలింగ్ నమోదైనట్లు డిప్యుటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా పేర్కొన్నారు.
పుదుచ్చేరిలో అత్యధికంగా 78 శాతం పోలింగ్ నమోదైంది. 43.3 శాతంతో జమ్ముకశ్మీర్ చివరిస్థానంలో నిలిచింది.