శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స ఐదు రోజులపాటు భారత్ పర్యటించేందుకు దిల్లీకి చేరుకున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోదీతో చర్చించనున్నారు. దేశంలోని వారణాసి, సార్నాథ్, బోధ్‌గయ, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలను లంక ప్రధాని ఈ పర్యటనలోనే సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీలంకలోని తమిళ సమాజానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, హిందూ మహా సముద్రం ప్రాంతంలోని పరిస్థితులు, ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇతర సమస్యలపై ప్రధానితో చర్చించనున్నారు రాజపక్స. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజపక్స భారత్‌కు రావటం ఇది రెండోసారి. గతేడాది నవంబరులో ఇదివరకే భారత్‌లో పర్యటించారు లంక ప్రధాని.
ఇదీ చూడండి: అధికారులు పట్టించుకోలేదని రోడ్డుపైనే స్నానం!