ETV Bharat / bharat

మోదీ టూ ట్రంప్​.. అందరూ మెచ్చే 'కాంగ్​డా టీ'

ఉదయాన్నే ఛాయ్‌ గొంతులో పడనిదే రోజు రోజులా ఉండదు చాలామందికి. లేస్తూనే టీ తాగేవరకూ మంచం దిగని వారూ ఉంటారు. రోజువారీ జీవితంలో అంతటి ప్రాధాన్యమున్న ఛాయ్.. పండించే ప్రాంతాన్ని బట్టి, రంగు, రుచి, సువాసన మారుతూ ఉంటుంది. పాలంపూర్‌లో ఉత్పత్తయ్యే కాంగ్‌డా టీ మాత్రం అన్నింటికంటే ప్రత్యేకం.

SPECIAL STORY ON KANGDA TEA MADE AT PALAMPUR IN HIMACHAL PRADESH
మోదీ టూ ట్రంప్​.. అందరు మెచ్చే ఛాయ్​- 'కాంగ్​డా టీ'
author img

By

Published : Oct 10, 2020, 3:34 PM IST

పాలంపుర్​లో తయారయ్యే 'కాంగ్​డా' టీ

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఉదయాన్నే ఓ కప్పు ఛాయ్‌తో రోజు ప్రారంభమవుతుంది. పొద్దున్నే టీ తాగకపోతే ఆ రోజంతా వెలితిగా ఉంటుంది. అందుకే ప్రస్తుతం ఎన్నో దేశాలు టీ ఉత్పత్తి చేస్తున్నాయి. భారత్‌లో అసోం మొదలు.. డార్జీలింగ్, కేరళలో ఛాయ్‌ రకాలు ఉత్పత్తవుతున్నాయి. కానీ పాలంపూర్‌లో తయారయ్యే కాంగ్‌డా టీ ప్రత్యేకతే వేరు.

చైనీస్​ హైబ్రిడ్​ టీ..

పాలంపూర్‌లో టీ ఉత్పత్తికి అనుకూల వాతావరణ పరిస్థితులు గమనించిన ఆంగ్లేయులు.. 1850లో టీ తోటల పెంపకం ప్రారంభించారు. చైనా నుంచి ఈ మొక్కలు తెప్పించారు. అందుకే ఇక్కడ పెరిగే టీని చైనీస్ హైబ్రిడ్‌ టీగానూ పిలుస్తారు.

"టీ తోటల పెంపకం ఎందుకు ఎంపిక చేశారంటే.. ఇక్కడ ఉన్నట్టుండి వడగండ్ల వాన కురుస్తుంది. అక్టోబర్‌, డిసెంబర్‌ లేదా మే నెలల్లో వడగండ్లు పడతాయి. ఈ పరిస్థితుల్లో ఇతర పండ్లేవీ పండవు. అందుకే ఆంగ్లేయులు టీ తోటల పెంపకం చేపట్టారు."

- బీబీఎల్ బూటెల్, టీ ఎస్టేట్ యజమాని

అన్నిటికంటే భిన్నం

కాంగ్‌డా టీ సువాసన, రుచి.. ఇతర ఛాయ్‌ల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ ప్రత్యేకత వల్లే ఎన్నోదేశాల వినియోగదారులు కాంగ్‌డా టీకే ప్రాధాన్యమిస్తారు.

"అసోం టీ చాలా సమయం తీసుకుంటుంది. ఎక్కువమొత్తంలో రంగు ఉంటుంది. కానీ సువాసన, నాణ్యత కాస్త తక్కువే. అందుకే కాంగ్‌డా టీని ఇంగ్లండ్, స్పెయిన్, బార్సిలోనా, హాలెండ్‌కు పంపారు. ఈ టీ బాగా ఆదరణ పొందింది. టీ తోటల పెంపకం ఎంతోమందికి ఉపాధి కల్పించింది. బ్రిటిషర్లకు వ్యాపారమార్గంగా మారింది."

- బీబీఎల్ బూటెల్, టీ ఎస్టేట్ యజమాని

ఆరోగ్యానికి మంచిదేనట..

రంగు, రుచి, సువాసనే కాదు ఆరోగ్యపరంగాను కాంగ్‌డా టీతో ఎన్నో లాభాలున్నాయి.

డార్జీలింగ్, అసోంలో ఉత్పత్తయ్యే టీ కంటే ఇక్కడ తక్కువే పండుతోంది. అయినా.. ఈ ఛాయ్‌కి ఉండే ప్రత్యేక లక్షణాల వల్ల ఎన్నోదేశాల వినియోగదారులు ఏరికోరి మరీ కొనుగోలు చేస్తారు.

"కాంగ్‌డా ఛాయ్‌ నాణ్యత చాలా బాగుంటుంది. అంతేకాదు ఆరోగ్యానికీ మంచిది. ఈ టీలో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ లక్షణాలుంటాయి. కాంగ్‌డా టీ లండన్, ఆమ్‌స్టర్‌డామ్‌లలో స్వర్ణ, రజత పతకాలు గెలుచుకుంది."

- డీఎస్ కన్వార్, టీ నిపుణులు

రాష్ట్ర ప్రభుత్వ చొరవతో..

బ్రిటిషర్లు దేశాన్ని విడిచివెళ్లిన తర్వాత.. పరిశోధన, అభివృద్ధిలో అంతగా మెరుగుదల లేకపోయినా.. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల దృష్టి ఆకర్షించింది కాంగ్‌డా టీ. ప్రచారం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలకంగా వ్యవహరించింది. బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ లాంటి రకాలు కూడా ఇక్కడ పండిస్తారు. ఈ టీ తోటలు 6 వేల మందికి ఉపాధి కల్పించాయి. ఇక్కడ ఉత్పత్తయ్యే టీపొడిలో సింహభాగం ఎగుమతి చేస్తారు.

"కాంగ్‌డా టీకి ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. 1850లో వీటి పెంపకం ప్రారంభమైంది. బ్రిటిషర్లు వెళ్లిపోయిన తర్వాత ఉత్పత్తి కొద్దిగా పడిపోయింది. ప్రస్తుతం ఎగుమతులు మళ్లీ ప్రారంభమయ్యాయి. కొందరు వ్యాపారులు జర్మనీ, ఇరాన్ లాంటి దేశాలకు కాంగ్‌డా టీని ఎగుమతి చేస్తున్నారు."

- మనోజ్ కుమార్, కాంగ్‌డా టీ ఉత్పత్తిదారుల సంఘం వైస్ ప్రెసిడెంట్

"కాంగ్​‌డా టీకి ఉండే రుచి, ప్రపంచంలోని మరే ఇతర టీ రకంలోనూ దొరకదు. డార్జీలింగ్ టీకి ఎలాగైతే ప్రత్యేక రుచి ఉంటుందో...కాంగ్‌డా టీకి కూడా ఓ విభిన్న రుచి ఉంటుంది. ఆసియా, ఐరోపా దేశాలకు కాంగ్‌డా టీ ఎగుమతి అవుతోంది."

- డా.పదమ్‌దేవ్, టీ ఉత్పత్తిదారుడు

ట్రంప్​నకు మోదీ గిఫ్ట్​ ఇదే..

విశిష్ట రుచి, సువాసన, నాణ్యత కారణంగా కాంగ్‌డా టీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఛాయ్‌ల జాబితాలో చేరిపోయింది. ఎన్నో అవార్డులు, ప్రశంసలు దక్కించుకుంది. మొదట్లో ఇంగ్లండ్, స్పెయిన్, హాలెండ్ లాంటి దేశాలకు ఎగుమతయ్యే కాంగ్​‌డా ఛాయ్.. ప్రస్తుతం ఫ్రాన్స్, జర్మనీ, అఫ్గానిస్థాన్​ లాంటి ఎన్నో దేశాలకు చేరుకుంటోంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కాంగ్‌డా టీని బహూకరించారు.

ఇదీ చదవండి: 'అలసట'ను అంత తేలిగ్గా తీసుకోవద్దండోయ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.