భాజపా ఎంపీ రమాదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్పీ ఎంపీ ఆజంఖాన్‌ను క్షమాపణలు చెప్పాల్సిందిగా స్పీకర్ ఓం బిర్లా సూచించనున్నారు. అన్ని పార్టీల నేతలతో సమావేశమైన తర్వాత బిర్లా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
"ఎంపీ రమాదేవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆజంఖాన్‌ను... స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభలో అడగనున్నారు. ఆజంఖాన్ క్షమాపణ చెప్పకపోతే... ఆయనపై చర్యలు తీసుకోవడానికి స్పీకర్‌కు అధికారం ఉంది."
- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
ఐదేళ్లపాటు సస్పెండ్ చేయండి
భాజపా ఎంపీ రమాదేవి.... తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్‌ను లోక్‌సభ నుంచి 5 సంవత్సరాలపాటు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: మోదీ 2.0 సర్కారు 50 రోజుల ప్రోగ్రెస్ కార్డ్