ETV Bharat / bharat

'కాంగ్రెస్ లక్ష్యం భాజపాను నిరోధించటం కాదు' - భాజపా

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ లక్ష్యం భాజపా ఓటమి కాదని విమర్శించారు సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్​. ఉత్తరప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా కాంగ్రెస్​ పనిచేస్తోందని ఆయన అన్నారు. కాబోయే ప్రధానిని నిర్ణయించేది కూటమేనని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి, నల్లధనంపై మోదీ సమాధానమివ్వాలన్నారు అఖిలేశ్. భాజపా యూపీకి చేసిందేమీ లేదని ఆరోపించారు.

'కాంగ్రెస్ లక్ష్యం భాజపాను నిరోధించటం కాదు'
author img

By

Published : Apr 26, 2019, 8:54 PM IST

కాంగ్రెస్ గేమ్ ప్లాన్.. 2022లో యూపీలో అధికారంలోకి రావటమే తప్ప.. భాజపాను నిలువరించటం కాదన్నారు సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. దేశ భవిష్యత్తు కోసం ఎస్పీ, బీఎస్పీలు సగం సీట్లను త్యజించాయన్నారు. పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు అఖిలేశ్.

కాంగ్రెస్​పై పదునైన విమర్శలు...

మతతత్వ పార్టీలను నిరోధించేందుకే యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమి ఏర్పాటైందని అఖిలేశ్ అన్నారు. కాంగ్రెస్​కు అతిపెద్ద పార్టీ అనే గర్వం ఉందని కనిపిస్తోందని కొద్ది రోజుల క్రితమే చురకలంటించిన అఖిలేశ్.. తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ తదుపరి ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యాన్ని మరచి.. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సర్కారు ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోందని అఖిలేశ్ వ్యాఖ్యానించారు.

కేంద్రంలో వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ పదేపదే చెప్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తదుపరి లక్ష్యం యూపీనేనని ప్రకటించిన నేపథ్యంలో అఖిలేశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కూటమి విచ్ఛిన్నంకాదు...

"బీఎస్పీ, ఆర్​ఎల్డీలతో సమాజ్​వాదీ పార్టీ బంధం బలంగా ఉంది. భాజపాను అధికారంలోకి రానీయొద్దనే ఇరు పార్టీలు సగం సీట్లు త్యాగం చేశాయి."
-అఖిలేశ్, ఎస్పీ అధినేత

మే 23న కూటమి విచ్ఛిన్నమవుతుందని, కూటమి "మహా కుమ్మక్కు" అనీ మోదీ చేసిన విమర్శలపైనా స్పందించారు అఖిలేశ్.

"మా కూటమిపై భాజపా ఎందుకంత ఉలిక్కిపడుతోంది. వాళ్లకేంటి నొప్పి. యూపీలో మా కూటమి బలంగా ఉంది. భాజపా మా దరిదాపుల్లో కూడా లేదు. ఇది క్షేత్రస్థాయిలో అసలైన పరిస్థితి. 38 పార్టీలతో ఏర్పడిన భాజపా కూటమిని ఏమనాలి? మేం కీలక సమస్యలపై పోరాటం చేస్తున్నాం. ప్రజలకు మాపై విశ్వాసం ఉంది."
-అఖిలేశ్, ఎస్పీ అధినేత

విమర్శలపై ఆగ్రహం...

మూడోదశ ఎన్నికల అనంతరం ఎస్పీ-బీఎస్పీల కూటమికి.. ఓటమి భయం పట్టుకుందంటూ యూపీ ఉప ముఖ్యమంత్రి సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలను అఖిలేశ్​ తీవ్రంగా ఖండించారు. మౌర్యకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యతే లేదని ఎద్దేవా చేశారు. మౌర్యకు మూడు రోజులు ప్రచారానికి హెలికాప్టరే ఇవ్వలేదన్నారు. మౌర్య ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు అఖిలేశ్.

అవినీతిపై అఖిలేశ్...

ఎస్పీ, బీఎస్పీలు గతంలో అవినీతికి పాల్పడ్డాయంటూ చేస్తోన్న విమర్శలు పసలేనివని కొట్టిపారేశారు అఖిలేశ్. ఆరోపణల్లో నిజం ఉంటే... అవకతవకలు జరిగి ఉంటే చర్యలు తీసుకోకుండాఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

యోగి ఓ పెద్ద ఫెయిల్యూర్...

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 'ఓ పెద్ద ఫెయిల్యూర్' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు అఖిలేశ్. గత రెండేళ్లలో రాష్ట్రానికి ఒక్క పైసా పెట్టుబడి రాలేదన్నారు. గొప్పలు చెప్పుకోవటం తప్ప యోగి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. గ్రీన్ వైరస్, రవుల్ విన్సీ, మామాజీ, కోల్​గేట్, ఆలీ, బజరంగ్​బలి అంటూ కబుర్లు చెప్తున్నారు తప్ప.. యూపీ అభివృద్ధికి యోగీ చేసిందేమీ లేదని, అసలు సీఎం వద్ద ఓ ప్రణాళికంటూ లేదని ఆరోపించారు.

కొత్త ప్రధానిని ఇచ్చేది మేమే...

తానేమీ ప్రధాని రేసులో లేనన్న అఖిలేశ్ యాదవ్... కాబోయే ప్రధానిని మాత్రం కూటమే నిర్ణయిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు.
భాజపా మాదిరి ఒకే ముఖం కాకుండా తమవైపు ప్రధాని పదవికి అర్హులైన అనేక మంది నేతలున్నారని స్పష్టం చేశారు. ఈ విషయం గురించి ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు.

మోదీనే సమాధానమివ్వాలి...

అవినీతి అంతమైంది లేనిది, నల్లధనం వెనక్కి వచ్చింది లేనిది, పెట్టుబడులు ఎంత మొత్తం వచ్చిందీ... మోదీ చెప్పాలని, ఉద్యోగాలు ఎందుకు మాయమవుతున్నాయో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు అఖిలేశ్. కీలక సమస్యల నుంచి ప్రజలను దారిమళ్లించేందుకే... భాజపా అక్కర్లేని అంశాలపై మాట్లాడుతోందన్నారు.

ఇటీవల కాంగ్రెస్ సైతం భాజపా మాదిరిగా రాజకీయ ప్రత్యర్థులను బెదిరించటంపైనే ఆధారపడుతోందని, గతంలో కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకున్నా... వారికి గర్వం చాలా ఎక్కువని అర్థమైందన్నారు. తాము భయపెట్టి రాజకీయాలు చేయబోమన్నారు.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.