కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్డౌన్లో అందించిన ఉచిత ఆహారధాన్యాల పంపిణీని మరో మూడు నెలలపాటు పొడిగించాలని కోరారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ మేరకు జులై-సెప్టెంబర్ 2020 వరకు పథకాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లాక్‌డౌన్‌తో లక్షలాది మంది ఆర్థింగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రాలు సైతం ఈ పథకాన్ని కొనసాగించాలని కోరిన విషయాన్నిలేఖలో పేర్కొన్నారు సోనియా. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై నిర్ణయం తీసుకొని.. పథకాన్ని పొడిగించాలన్నారు. తన అభ్యర్థనపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాత్కాలిక రేషన్ కార్డులు ఇవ్వాలి..
ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌సరకుల పథకంలో ఇప్పటికీ అనేక మంది పేద ప్రజలు లేరని ఆందోళన వ్యక్తం చేశారు సోనియా గాంధీ. అలాంటి వారికి తాత్కాలిక రేషన్‌కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: చైనా సైన్యంపై గెలుపు సులువే- ఇవే కారణాలు...