దిల్లీని వీడిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. గోవాకు చేరుకున్నారు. సోనియా వెంట ఆమె కుమారుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నారు. గోవా రాజధాని పనాజీలో శుక్రవారం మధ్యాహ్నం వాళ్లు అడుగు పెట్టారు.



దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత సమస్యతో సోనియా గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఆగస్టులో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సోనియా గాంధీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దిల్లీలో పెరుగుతున్న కాలుష్యంతో ఆ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నందున.. దిల్లీని వీడి వెళ్లాలని వేరే ప్రదేశానికి వెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు ఆమె.. గోవాలో ఉండేందుకు వచ్చారు.
ఇదీ చూడండి:దిల్లీని వీడనున్న సోనియా గాంధీ!