ETV Bharat / bharat

పార్లమెంటుకు సోనియా, రాహుల్​ గైర్హాజరు- కారణమిదే - పార్లమెంట్ సమావేశాలకు సోనియా గైర్రాజరు

అసాధారణ పరిస్థితుల్లో నిర్వహిస్తోన్న పార్లమెంటు సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గైర్హాజరు అయ్యారు. సాధారణ వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లిన సోనియా.. కరోనా కాలంలో కీలకమైన సమావేశాల్లో పాల్గొనకపోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

par sonia
సోనియా, రాహుల్
author img

By

Published : Sep 14, 2020, 12:38 PM IST

కరోనా వేళ.. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కీలక సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గైర్హాజరు అయ్యారు. మరో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పార్లమెంటుకు రాలేదు.

సోనియా గాంధీ.. సాధారణ వైద్య పరీక్షల కోసం శనివారం అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తోంది. రాహుల్​ గాంధీ కూడా ఆమె వెంటే వెళ్లినట్టు సమాచారం. దాదాపు 14రోజుల పాటు అక్కడే ఉండనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కారణంగా పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలకు సోనియా, రాహుల్​ దూరమయ్యారు.

అమెరికా నుంచి వచ్చిన అనంతరం సమావేశాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోనియాకు సాయం చేసేందుకు ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ అమెరికా వెళ్లనున్నారు. ఆ తర్వాత రాహుల్​ దిల్లీకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ప్రయాణానికి ముందుగా..

అమెరికాకు వెళ్లేముందు తన పార్లమెంటరీ వ్యూహాత్మక బృందంతో సోనియా భేటీ అయ్యారు. ఉభయ సభల్లో సమన్వయంతో పాటు సమావేశాల్లో ముఖ్యమైన సమస్యలను లేవనెత్తడానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక మందగమనం, కరోనా విపత్తు అంశాలను లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా.. ప్రయాణానికి ముందు రోజు పార్టీలో సంస్థాగత ప్రక్షాళన చేశారు. గతంలో సోనియాకు లేఖ రాసిన సీనియర్​ నేతల్లో ఆజాద్​ వంటి చాలా మంది తమ పార్టీ పదవులను కోల్పోయారు.

పార్లమెంటు సమావేశాలు..

కరోనా విపత్తు సమయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పార్లమెంటు సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. భౌతిక దూరం, మాస్కులను తప్పనిసరి చేశారు. దూరం పాటించటం కోసం ఛాంబర్లతో పాటు గ్యాలరీల్లోనూ సభ్యులు కూర్చునే ఏర్పాటు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.