సాధారణ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చారు. మంగళవారం ఉదయం దిల్లీ చేరుకున్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి 2 రోజుల ముందు తనయుడు రాహుల్ గాంధీతో కలిసి అమెరికా వెళ్లారు సోనియా. కరోనా మహమ్మారి కారణంగా.. ఇప్పటివరకు ఆమె అమెరికా ప్రయాణం వాయిదా పడి వైద్య పరీక్షలు ఆలస్యం అయ్యాయని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
అమెరికా వెళ్లేముందు కాంగ్రెస్లో సంస్థాగత మార్పులు చేశారు సోనియా గాంధీ.