కేంద్ర ప్రభుత్వంపై యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. సమాచార హక్కు చట్టాన్ని మోదీ సర్కార్ నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆరోపించారు.
కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర విజిలెన్స్ కమిషన్లానే... సమాచార హక్కు చట్టానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని సోనియా గాంధీ ఆరోపించారు. గత పదేళ్లలో దాదాపు 60 లక్షల మంది ఆర్టీఐని ఉపయోగించుకున్నారని... తద్వారా దేశంలోని బలహీన వర్గాలకు చాలా లబ్ధి చేకూరిందని ఆమె పేర్కొన్నారు.
ఈ సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం... ప్రతి భారత పౌరుణ్నీ శక్తిహీనం చేస్తోందని సోనియా వ్యాఖ్యానించారు. సమాచార హక్కు చట్టం ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: మాకు 4 వారాల సమయమివ్వండి: రెబల్స్