వచ్చే ఏడాది కేరళ, అసోం రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ముగ్గురు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) కార్యదర్శలను నియమించారు ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ.
కొత్తగా నియామకం పొందినవారిలో.. కేరళ తరపున తారిక్ అన్వర్, అసోం నుంచి జితేంద్రసింగ్‌లు ఎన్నికల విధుల్లో ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సహాయకులుగా ఉండనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది.
మాజీ ఎమ్మెల్యేలు అనిరుద్ సింగ్, వికాస్ ఉపాధ్యాయ, పృథ్వీరాజ్ ప్రభాకర్ సాథేలను అసోం ఏఐసీసీ కార్యదర్శులుగా నియమించింది కాంగ్రెస్. ఇక కేరళకు మాజీ ఎంపీపీ విశ్వనాథన్, మాజీ ఎమ్మెల్సీ ఇవాన్ దిసౌజా, పీవీ మోహన్‌లను నియమిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. కేరళ రాష్ట్రంలో గతంలో ఈ బాధ్యతలు నిర్వర్తించిన హరిపాల్ రావత్, సంజయ్ చౌదరి సహా.. అసోం ఏఐసీసీ సంయుక్త కార్యదర్శిలను ఆ బాధ్యతల నుంచి తప్పించింది.
ఇదీ చదవండి:అసమ్మతి నేతలతో సోనియా సుదీర్ఘ భేటీ