నియంత్రణ రేఖ వెంబడి పాక్ దుశ్చర్యలకు అంతులేకుండా పోతోంది. జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లా సుందర్బనీ సెక్టార్లో పాక్ సైన్యం కాల్పుల విరమణకు పాల్పడింది. ఈ ఘటనలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు.
పాక్ చర్యను.. భారత బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయని సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.
మృతుడు.. రాజస్థాన్ జోధ్‌పుర్‌కు చెందిన సిపాయ్ లక్ష్మణ్‌గా గుర్తించారు. పాక్ బలగాల కాల్పుల్లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు నలుగురు సైనికులు బలయ్యారు.
ఈ జనవరిలో దాయాది సైన్యం కాల్పుల్లోనే ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: డీఆర్డీఓ కొత్త యుద్ధ విమానాలు ఇవే...