ఉదయం 9.15 నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. ఇది సాయంత్రం 3.04 నిమిషాల వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 12.10 నిమిషాలకు పూర్తిస్థాయిలో సూర్యుడు, చంద్రుడు ఒకే వరుసలోకి రానున్నారు. దిల్లీ, జమ్ముకశ్మీర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో గ్రహణం కనువిందు చేస్తోంది.
ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, పసిఫిక్, హిందూ మహా సముద్రం ప్రాంతాల నుంచి గ్రహణం కనిపిస్తోంది.
ఇదీ చూడండి: 18వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ సిబ్బంది యోగాసనాలు