ETV Bharat / bharat

రైల్వే స్టేషన్​కు వలస కూలీలు బారులు- రాజకీయ దుమారం - భారతదేశంలో కరోనా వైరస్

లాక్​డౌన్​ నిబంధనలను ఉల్లంఘిస్తూ ముంబయి బాంద్రా రైల్వే స్టేషన్​ వద్ద వెయ్యి మందికిపైగా వలస కూలీలు గుమిగూడటం కలకలం రేపింది. లాక్​డౌన్​ను పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన కొద్ది గంటలకే ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఛానల్​లో వచ్చిన వార్త ఆధారంగానే ప్రజలు బయటికి వచ్చి ఉంటారని మహారాష్ట్ర మంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు.

MH-LOCKDOWN-MIGRANTS
'బాంద్రా తరహా ఘటనలతో కరోనాపై పోరాటం వృథా'
author img

By

Published : Apr 14, 2020, 11:02 PM IST

ప్రధాని నరేంద్రమోదీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తునట్టు ప్రకటించిన నేపథ్యంలో ముంబయిలో వలసకూలీలు ఆందోళన బాట పట్టారు. బాంద్రాలో వందల మంది బస్టాండు, రైల్వే స్టేషన్​కు తరలివచ్చి భౌతిక దూరం నిబంధనలను ఉల్లంఘించారు. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తగిన రవాణా ఏర్పాట్లు చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు.

లాక్​డౌన్​ పొడిగింపుతో ఏప్రిల్‌ 15 తర్వాత సొంతూళ్లకు వెళ్లిపోదామని అనుకున్నవారికి నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 3 గంటలకు ఒక్కసారిగా వెయ్యిమందికి పైగా వలస కూలీలు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

ఈ వార్త ఆధారంగానే..

మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ఒక వార్తా సంస్థకు చెందిన వీడియో క్లిప్​ను షేర్ చేశారు. లాక్​డౌన్​లో చిక్కుకుపోయిన వలస కూలీలను వారి స్థానిక ప్రాంతాలకు పంపేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ వీడియో సారాంశం.

ఈ మధ్యాహ్నం సదరు ఛానల్​లో ఆ వార్తను ప్రసారం చేయడం వల్లనే బాంద్రా రైల్వే స్టేషన్​ వద్ద ప్రజలు గుమిగూడి ఉంటారని మంత్రి ట్విట్టర్​లో వీడియోను షేర్​ చేస్తూ.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇలా చేస్తే పోరాటం వృథా..

బాంద్రా ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో కేంద్ర హోంత్రి అమిత్ షా మాట్లాడారు. ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు కరోనాపై దేశం చేస్తున్న పోరాటాన్ని బలహీనం చేస్తాయని పేర్కొన్నారు.

ఈ కఠిన పరిస్థితుల్లో రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామని.. ఇటువంటి విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఠాక్రేకు షా సూచించారు.

ఇంటికే వెళ్లాలి..

రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కూలీలకు కావాల్సిన ఆహారం, ఇతర అవసరాలను తీర్చేందుకు ఎన్జీవోలు, పలు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి బాగోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి.

కొందరు వలస కార్మికులు మాట్లాడుతూ తమకు ఎటువంటి సహాయం చేయనక్కర్లేదని, స్వస్థలాలకు పంపిస్తే చాలని వాపోతున్నారు. ఇప్పటికే తాము దాచుకున్న డబ్బులు మొత్తం ఖర్చయ్యాయని, ఇకనైనా తమ సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు.

వీరిలో బంగాల్​, ఉత్తర్​ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

సీఎం అభ్యర్థన..

లాక్​డౌన్​ అంటే జైలులో ఉన్నట్లు కాదని.. కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు వెనక్కు తగ్గాలని వలస కూలీలను కోరారు సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. మహారాష్ట్రలో వలస కూలీలకు పూర్తి భద్రత ఉంటుందని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 14 తర్వాత రైల్వే సేవలు ప్రారంభమవుతాయన్న వార్తలతోనే ఈ గందరగోళం తలెత్తిందని ఆయన అన్నారు.

ప్రభుత్వ వైఫల్యం

బాంద్రా ఘటన మహారాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. అంతమంది ఒక్కసారి రోడ్లపైకి వస్తుంటే ఏం చేశారని ప్రశ్నించారు.

"బాంద్రా వీధుల్లోకి వేలాది కూలీలు రావటం చాలా తీవ్రమైన ఘటన. వలస కూలీలకు భోజన సదుపాయం, సౌకర్యాలు కల్పించటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అ.యితే ఇటువంటి విషయాల్లో కేంద్రాన్ని నిందిస్తారు. కరోనాపై పోరాటం రాజకీయ విషయం కాదని ఇప్పటికైనా గుర్తించాలి. "

-దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర మాజీ సీఎం

అయితే వలస కూలీల విషయంలో మహారాష్ట్ర మొదటి నుంచి కేంద్రాన్ని కోరుతోంది. వారి స్వస్థలాకు పంపే ఏర్పాట్లు చేయాలని ప్రధాని నరేంద్రమోదీని ఉద్ధవ్ ఠాక్రే పలు సార్లు కోరారు. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.