జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. హిమపాతంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో హిమాచల్ రవాణా శాఖ పలు అవగాహనా కార్యక్రమాలను చేపట్టింది. మంచుతో నిండిన రహదారులపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాహనదారులకు సూచిస్తోంది.
కీలాంగ్ ప్రాంతంలోని లాహౌల్, స్పిటి జిల్లాల్లో 'జీప్ ర్యాలీని' నిర్వహించారు. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని హిమాచల్ ప్రదేశ్ రవాణా శాఖ సూచించింది.
మరోవైపు జమ్ముకశ్మీర్‌లోనూ భారీగా మంచు కురుస్తోంది. కశ్మీర్ ప్రాంతమంతా శ్వేతవర్ణ శోభితంగా దర్శనమిస్తూ కనువిందు చేస్తోంది. ఈ మంచులో ఉత్సాహంగా గడుపుతున్నారు పర్యటకులు.
ఇదీ చదవండి: రూ. 30 కోట్లు విలువ చేసే హెరాయిన్ స్వాధీనం