ETV Bharat / bharat

పాముతో భార్యను చంపింది.. అందుకోసమే! - పాముతో భార్యను చంపిన కేసు

కేరళ కొల్లాం జిల్లాలో ఓ వ్యక్తి పాముతో తన భార్యను చంపిన కేసులో కీలక ఆధారాలను సేకరించారు అధికారులు. రెండో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Snakebite murder case: Kerala Crime Branch visits Uthra's house with accused to collect evidence
కేరళ కొల్లాం జిల్లాకు చెందిన సూరజ్​
author img

By

Published : May 26, 2020, 9:14 PM IST

ఓ వ్యక్తి తన భార్యను పాముతో కరిపించి చంపిన కేసుకు సంబంధించిన దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. మంగళవారం సంఘటనా స్థలం వద్ద కీలక ఆధారాలను సేకరించారు.

పాముతో భార్యను చంపిన కేసులో కీలక ఆధారాలు సేకరణ

కేరళ కొల్లాం జిల్లాకు చెందిన సూరజ్​ తన భార్యను చంపటం కోసం పామును కొని దానిని ఓ ప్లాస్టిక్​ కంటైనర్​లో ఉంచినట్లు విచారణలో తేలింది. ఆ కంటైనర్​ను అతడు ఇంటి పెరటిలో దాచిపెట్టాడు. దర్యాప్తు సమయంలో స్థానిక ప్రజలు అడ్డుకోకుండా పటిష్ట భద్రత నడుమ ఆధారాలను సేకరించారు ఫోరెన్సిక్ నిపుణులు.

మరో వివాహం కోసమే..

భార్యను చంపి ఆ తర్వాత ఆమె బంగారం, నగదును దక్కించుకొని.. అనంతరం మరొక మహిళను వివాహం చేసుకోవాలనే దురుద్దేశంతోనే అతడు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:పక్కా 'పాము' స్కెచ్​తో భార్యను చంపేశాడు.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.