ETV Bharat / bharat

'హత్యాచారాలపై రాజకీయాలా? ఉరిశిక్ష పడాల్సిందే'

మహిళా భద్రత విషయంలో విపక్షాలు చేసిన విమర్శల్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తిప్పికొట్టారు. హత్యాచారాలపై రాజకీయాలు చేయడం తగదని మండిపడ్డారు. నిందితులకు ఉరిశిక్ష పడాల్సిందేనని తేల్చిచెప్పారు.

smriti-irani-in-lok-sabha-condemns-hyderabad-unnav-incidents
'హత్యాచారాలపై రాజకీయాలా? ఉరిశిక్ష పడాల్సిందే'
author img

By

Published : Dec 6, 2019, 1:54 PM IST

దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హత్యాచారాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఇలాంటి చర్యల వల్ల బాధితులకు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు.
మహిళల భద్రతపై లోక్​సభలో చర్చ సందర్భంగా మాట్లాడారు స్మృతి. అఘాయిత్యాలు జరగకుండా చట్టాలను కఠినతరం చేయటం సహా అనేక చర్యలను తమ ప్రభుత్వం తీసుకున్నట్లు చెప్పారు.

'హత్యాచారాలపై రాజకీయాలా? ఉరిశిక్ష పడాల్సిందే'

"ఉన్నావ్‌ ఘటన హేయమైన నేరమే. హైదరాబాద్‌లో జరిగిన ఘటన కూడా హేయమైనదే.

ఒక యువతిని అత్యాచారం చేసి కాల్చి చంపి అమానవీయ చర్యకు పాల్పడిన వారికి ఉరిశిక్ష పడాల్సిందే. కానీ ఇలాంటి నేరాలపై రాజకీయాలు చేయటం ద్వారా బాధితులకు మేలు జరుగుతుందా? 1023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు కోసం రాష్ట్రాలకు నిధులు కేంద్రం ఇచ్చింది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుంది."
- స్మృతి ఇరానీ, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి

New Delhi, Dec 06 (ANI): Congress leader Shashi Tharoor commented on the encounter of all four accused in Telangana's veterinarian rape-murder case. He said, "The most important thing is that justice to be done through judicial process. In this particular incident we don't know the full details." "The police default mode should be find all the evidence and take the accused to the court," he further added.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.