లోక్‌సభ ఎంపీగా.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రమాణ స్వీకారం హర్షధ్వానాల నడుమ సాగింది. ప్రొటెం స్పీకర్ స్మృతి ఇరానీ పేరు పిలవగానే సభలోని ఎన్డీఏ సభ్యులందరూ చప్పట్లతో ఘనస్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం ఆద్యంతం కరతాళ ధ్వనుల మధ్య సాగింది.
అనంతరం ప్రొటెం స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపిన స్మృతి.. సభలోని సోనియా గాంధీ సహా విపక్ష నేతలందరికీ అభివాదం చేస్తూ ముందుకెళ్లారు.
కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ... ఉత్తర్‌ప్రదేశ్ అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్‌గాంధీపై ఘనవిజయం సాధించారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఇక్కడ 55 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు
ఇదీ చూడండి:- పెళ్లి కార్డు రూ. 8లక్షలు... పెళ్లి ఖర్చు 200కోట్లు!