నైరుతి రుతుపవనాలు కేరళను జూన్ 1న తాకుతాయని భారత వాతారవణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో.. అవి ఇప్పటికే చేరుకున్నాయని ప్రైవేటు వాతావరణ సంస్ధ స్కైమెట్ తెలిపింది. ప్రస్తుత వర్షపాతం, రేడియో ధార్మికత స్థాయి, గాలి వేగాన్ని బట్టి చూస్తే కేరళకు నైరుతి రుతుపవనాలు వచ్చినట్లే భావిస్తున్నట్లు స్కైమెట్ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో వెల్లడించింది.
అయితే స్కైమెట్ ప్రకటనపై భారత వాతావరణ శాఖ విభేదించింది. కేరళను రుతుపవనాలు తాకినట్లు ప్రకటించడానికి పరిస్ధితులు అందుకు అనుగుణంగా లేవని తెలిపింది. కేరళను రుతుపవనాలు జూన్ 5న తాకుతాయని మొదట ప్రకటించిన భారత వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడ్డ పరిస్ధితుల ఆధారంగా జూన్ 1న అవి చేరుకుంటాయని రెండు రోజుల క్రితం వెల్లడించింది.
ఇదీ చూడండి: మొబైల్ లాక్కున్నారని బాలుడి ఆత్మహత్య!