ETV Bharat / bharat

సిక్కిం ముఖ్యమంత్రిగా పీఎస్​ గోలే..! - సిక్కిం డెమొక్ట్రాటిక్​ ఫ్రెంట్'

సిక్కింలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన 'సిక్కిం క్రాంతికారి మోర్చా' ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. తాజాగా గవర్నర్​ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరింది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి పీఎస్​ గోలే విషయంలో గవర్నర్​ న్యాయనిపుణుల సలహా కోరారు.

సిక్కిం ముఖ్యమంత్రిగా పీఎస్​ గోలే..!
author img

By

Published : May 25, 2019, 11:39 PM IST

ఈశాన్య రాష్ట్రం సిక్కింలో రాజకీయం రసవత్తరంగా మారింది. సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్​కేఎమ్​) ప్రతినిధి బృందం పార్టీ అధ్యక్షుడు పిఎస్​ గోలే ఆధ్వర్యంలో గవర్నర్​ గంగాప్రసాద్​ను కలిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అవకాశం కల్పించాలని కోరింది.

తాజా ఎన్నికల్లో రాష్ట్రంలోని 32 అసెంబ్లీ స్థానాలకుగాను... 17 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా 'సిక్కిం క్రాంతికారి మోర్చా' అవతరించింది. అయితే ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న ప్రశ్నకు... త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పీఎస్​ గోలే తెలిపారు.

ముఖ్యమంత్రి ఎవరు?

సిక్కింలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 'సిక్కిం క్రాంతికారి మోర్చా' తరఫున ముఖ్యమంత్రిగా పీఎస్​ గోలేకే అవకాశం ఎక్కువగా ఉంది. తాజా ఎన్నికల్లో ఆయన పోటీ చేయకపోయినా, పార్టీ మాత్రం గోలేనే సీఎం కావాలని కోరుకుంటోంది.

గవర్నర్​ నిర్ణయమేమిటి?

పీసీ గోలేను ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఆహ్వానించే విషయంపై... గవర్నర్ గంగాప్రసాద్​ న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న పీఎస్​ గోలేకు అవినీతి కేసులో ఏడాది జైలు శిక్షపడింది. అలాగే అతను 2017లో ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యారు.

బలమైన ప్రతిపక్షం..

మరోవైపు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పవన్​కుమార్​ చామ్లింగ్​ ఆధ్వర్యంలోని 'సిక్కిం డెమొక్ట్రాటిక్​ ఫ్రెంట్' (ఎస్​డీఎఫ్)​ 15 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.

ఇదీ చూడండి: ప్రభుత్వ ఏర్పాటుకు మోదీకి రాష్ట్రపతి ఆహ్వానం

New Delhi, May 25 (ANI): Vivek Oberoi starrer 'PM
Narendra Modi' which finally made it to the big screens after much controversy witnessed a decent box office collection on the first day of its release. The film managed to get a lukewarm start in the morning with a speedy pickup in the evening. The biopic's Friday collection totaled Rs. 2.88 crore. Film critic and trade analyst Taran Adarsh shared the film's box office performance on Twitter. Being the much-awaited film after Narendra Modi's resounding victory in the Lok Sabha elections, the biopic received mixed reactions. The biopic depicted the journey of Modi from his humble beginnings to his years as a chief minister and finally his landmark election as the Prime Minister of the country.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.