ETV Bharat / bharat

'దిల్లీ హింసకు దీప్​ సిధు లాంటి విద్రోహ శక్తులే కారణం'

author img

By

Published : Jan 27, 2021, 5:28 PM IST

కిసాన్ పరేడ్ ఉద్రిక్తంగా మారటానికి నటుడు దీప్ సిధు, ఇతర అసాంఘిక శక్తులే కారణమని సంయుక్త కిసాన్​ మోర్చా తీవ్ర ఆరోపణలు చేసింది. ఎలాంటి విద్రోహ శక్తులను ఉద్యమంలోకి రానివ్వమని స్పష్టం చేసింది. తదుపరి కార్యచరణపై 41 రైతుల సంఘాల నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించింది సంయుక్త కిసాన్​ మోర్చా.

SKM alleges antisocial elements tried to ‘torpedo' peaceful protests, slams govt, actor Deep Sidhu
'దీప్​ సిధు లాంటి విద్రోహ శక్తులే దిల్లీ హింసకు కారణం'

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీ ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో సంయుక్త కిసాన్​ మోర్చా తీవ్ర ఆరోపణలు చేసింది. పంజాబీ నటుడు దీప్ సిధు లాంటి అసాంఘిక శక్తులే ర్యాలీలో అల్లర్లు సృష్టించాయని పేర్కొంది. విద్రోహ శక్తులకు తమ ఉద్యమంలో స్థానం లేదని స్పష్టం చేసింది. ఈ ఘటన తరువాత.. తదుపరి కార్యచరణపై ప్రణాళికలు రూపొందించేందుకు బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. సంయుక్త కిసాన్​ మోర్చా 41 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది.

" రెండు నెలలుగా శాంతియుతంగా కొనసాగుతున్న రైతు ఉద్యమంతో కేంద్రంలో కదలికలు తీసుకొచ్చాం. కానీ కిసాన్​ మజ్​దూర్​ సంఘర్ష్​ కమిటీ ఉద్యమానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అల్లర్లు సృష్టిస్తోంది. ఉద్యమం మొదలైన 15 రోజుల నుంచే కిసాన్​ మజ్​దూర్​ సంఘర్ష్​ కమిటీ సొంతంగా నిరసనలు చేపడుతోంది. వాళ్లు మా ఉద్యమంలో భాగస్వామ్యం కాదు."

- సంయుక్త కిసాన్​ మోర్చా

ట్రాక్టర్​ ర్యాలీ నిర్ణీత సమయానికి ముందే కిసాన్​ మజ్​దూర్​ సంఘర్ష్​ కమిటీకి చెందిన ఆందోళనకారులు ఎర్రకోట వైపు మార్చ్​ చేశారు. కచ్చితంగా రైతు ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఇలా చేశారని మండిపడ్డారు.

ఇదీ చదవండి : దిల్లీ అల్లర్లలో 'దీప్‌ సిధు' పాత్రేంటీ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.