ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ ఓ 6 నెలల చిన్నారి.. ఫొటోల ద్వారా అద్భుత సందేశాన్నిస్తోంది. గుజరాత్‌లోని వల్సాద్ ప్రాంతానికి చెందిన ఈ పాపాయి.. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా వాడాలని తన చిత్రాలతో ప్రజలను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో చేతులను శుభ్రపరచుకోవాలని కూడా అవగాహన కల్పిస్తోంది.
కొవిడ్ రక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్య శాఖ, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగానే ధరంపుర్ వాసి కునాల్ భాయ్ పాండ్య.. ఇలా తన కూతురు హెట్వి ద్వారా ప్రజలను ఇంట్లోనే ఉండాలని సూచిస్తూ విజ్ఞప్తి చేశారు.
గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తోన్న పాండ్య.. వైరస్‌కు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తూ ఇలా తన కూతురు ద్వారా అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి: మనిషి కంటే ముందే పుట్టిన వైరస్‌లు