సెప్టిక్ ట్యాంకులోని విషవాయువును పీల్చడం వల్ల ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ జిల్లాలో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది.
జిల్లాలోని దేవీపుర్ గ్రామంలో ఆదివారం ఉదయం ఓ నివాసంలో సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు నలుగురు కూలీలు దిగారు. ఆ తర్వాత ఇంటి యజమాని కుమారులిద్దరు కూడా దిగారు. చాలాసేపటి తర్వాత గ్రామస్థులు ట్యాంకు తవ్వి చూడగా.. అందరూ స్పృహ లేకుండా పడి ఉన్నారు.
దీంతో ఆరుగురినీ స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించారని వైద్యులు ప్రకటించారు. విషవాయువు పీల్చడం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టంచేశారు.