బాణసంచా తయారీకి వినియోగించే ముడి పదార్థాలతో కార్మికులు పని చేస్తున్న క్రమంలో పేలుడు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
" పేలుడు ధాటికి నలుగురు భవనం నుంచి దూరంగా ఎగిరిపోయారు. మరో ఇద్దరు శిథిలాల కింద ఇరుక్కున్నారు. వారందరూ మరణించారు." - సహాయక చర్యలు చేపట్టిన అధికారి
అగ్నిమాపక సిబ్బందితో పాటు విపత్తు రక్షణ అధికారులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని సమీపంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరో వ్యక్తిని చికిత్స అనంతరం ఇంటికి పంపారు.
ఘటనలో ఆరుగురి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి.