అసోంలో వరదలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వరదల కారణంగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు వరదలు, కొండచరియలు విరిగిపడి మరణించినవారి సంఖ్య 76కు పెరిగింది. వీరిలో 50 మంది వరదలతో మృతి చెందగా 26 మంది కొండచరియలు విరిగిపడి మృత్యువాతపడ్డారు.
27 జిల్లాల్లో సుమారు 22 లక్షల మంది ప్రభావితమయ్యారు. అత్యధికంగా బర్పేటా జిల్లాలో 5.44 లక్షల మందికి పైగా ప్రభావితం కాగా సాల్మరలో 1.92 లక్షలు, ధేమాజీలో 1.30 లక్షల మంది వరదలతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి: పద్మనాభస్వామి ఆలయంలో ఆ గది ఇక తెరుచుకోనట్టే!