అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు తిరుగుబాటుదారులు మృతి చెందారు. భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య ఖోన్సా ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అసోం రైఫిల్స్‌కు చెందిన సైనికుడికి గాయాలయ్యాయి. అతడిని సైనిక ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలంలో ఆరు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతులు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ తిరుగుబాటు సంస్థకు చెందినవారని సమాచారం.