ETV Bharat / bharat

'బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం' - hathras sit investigation

యూపీ హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారుల బృందం హాథ్రస్​లో పర్యటించింది. బాధితురాలి కుటుంబం నుంచి వాంగ్మూలం తీసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకొని విచారణ చేపడుతుందని తెలిపింది. దోషులను కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చింది.

SIT will look into all issues raised by victim's family members ; sit investigation in hathras
'హాథ్రస్ బాధిత కుటుంబం తెలిపిన అంశాలపై సిట్ దర్యాప్తు'
author img

By

Published : Oct 3, 2020, 8:00 PM IST

సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఆదేశాలతో ఉత్తర్ ప్రదేశ్ హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సహా ఉన్నతాధికారుల బృందం హాథ్రస్‌లో పర్యటించింది. బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంది. దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. ఆ గ్రామంలో ఆడపిల్లలకు శాశ్వత రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చింది.

ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బాధితురాలి కుటుంబం లేవనెత్తిన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని విచారిస్తుందని స్పష్టం చేశారు యూపీ అదనపు ముఖ్య కార్యదర్శి అవనీష్​ అవస్తి. యువతి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన ఉన్నతాధికారుల బృందం.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను యోగి ఆదిత్యనాథ్‌కు సమర్పించనున్నట్లు తెలిపారు.

శుక్రవారం సిట్ తొలి నివేదిక సమర్పించిన రెండు గంటల్లోనే ఎస్పీ, సీఐ సహా పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు యోగి.

ఇదీ చదవండి: 'హాథ్రస్​లో మీడియా, రాజకీయ నేతలకు అనుమతివ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.