ETV Bharat / bharat

ఏకచ్ఛత్రాధిపత్యం నుంచి ఏక్​ నిరంజన్​గా చామ్లింగ్​! - 25ఏళ్ల పాటు అధికారంలో.

సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్​(ఎస్‌డీఎఫ్‌) పార్టీకి ఆరాష్ట్రంలో ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 25 ఏళ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి తప్ప వేరే నాయకులు లేని దుస్థితి ఏర్పడింది. 10 మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. మరో ఇద్దరు అధికార ఎస్​కేఎం తీర్థం పుచ్చుకున్నారు.

ఏకచ్ఛత్రాధిపత్యం నుంచి ఉనికిని కోల్పోయే ప్రమాదం!
author img

By

Published : Aug 15, 2019, 5:46 AM IST

Updated : Sep 27, 2019, 1:44 AM IST

రెండున్నర దశాబ్దాల పాటు ఏకచ్ఛత్రాధిపత్యం వహించి సిక్కింను పాలించిన సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(ఎస్‌డీఎఫ్‌)కు ఇప్పుడు రాష్ట్రంలో ఉనికే లేకుండా పోతోంది. తాజాగా ఆ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరగా.. బుధవారం మరో ఇద్దరు అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్‌కేఎం) కండువా కప్పుకున్నారు. ఫలితంగా ప్రస్తుత సిక్కిం శాసనసభలో ఎస్‌డీఎఫ్‌ నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనే.. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌.

25ఏళ్ల పాటు అధికారంలో..

పవన్‌కుమార్‌ చామ్లింగ్‌.. దేశంలోనే అత్యంత ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత. 1993లో సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పేరుతో పార్టీని స్థాపించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఎస్‌డీఎఫ్‌ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి వరుసగా ఐదు పర్యాయాలు గెలిచి అధికారాన్ని కొనసాగించింది. సుదీర్ఘంగా 25ఏళ్లు పాటు పవన్‌ చామ్లింగ్‌ సీఎంగా పనిచేశారు. సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. 2004 ఎన్నికల్లో ఎస్‌డీఎఫ్‌ పార్టీ 31 చోట్ల గెలుపొందింది. 2009 ఎన్నికల్లో అయితే అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్‌ చేసింది.

తిరుగుబాటు ఎమ్మెల్యేనే ప్రత్యర్థి..

ఎస్‌డీఎఫ్‌కు చెందిన ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్ పార్టీలో ప్రముఖ నేత. పవన్‌ చామ్లింగ్‌ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. అయితే 2009లో అప్పటి సీఎంపైనే విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. 2013 ఫిబ్రవరిలో సిక్కిం క్రాంతికారి మోర్చా ఏర్పాటైన తర్వాత ఎస్‌డీఎఫ్‌ను అధికారికంగా వీడి ఎస్‌కేఎంలో చేరారు. అనతి కాలంలోనే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రేమ్‌ సింగ్‌ పార్టీని వీడాక ఎస్‌డీఎఫ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అప్పటి నుంచి రాష్ట్రంలో శోభను కోల్పోతూ వస్తోంది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ నేతృత్వంలోని ఎస్‌కేఎం పార్టీ మొత్తం 32 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఎస్‌డీఎఫ్‌ పార్టీనే మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటికీ సంఖ్యా బలం తగ్గింది. పవన్‌ చామ్లింగ్‌ పార్టీకి ఓటు షేరు కూడా పడిపోయింది.

2019లో తొలి ఓటమి..

ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎస్‌డీఎఫ్‌ పార్టీ తొలిసారిగా ఓటమి చవిచూసింది. ఈ ఎన్నికల్లో ఎస్‌డీఎఫ్‌ 15 స్థానాల్లో గెలవగా.. ఎస్‌కేఎం పార్టీ 17 చోట్ల గెలిచి.. 25ఏళ్ల పవన్‌ చామ్లింగ్‌ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఎస్‌డీఎఫ్‌ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు రెండేసి స్థానాల చొప్పున పోటీ చేసి విజయం సాధించారు. ఫలితాల అనంతరం ఒక స్థానాన్ని ఎంచుకుని మరో దానికి రాజీనామా చేశారు. అలా ఎస్‌డీఎఫ్‌ సంఖ్యాబలం 13కు తగ్గింది.

ఒక్కొక్కరు కాదు.. అందరూ ఒకేసారి

వీరిలో 10 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీని వీడినందున ఎస్‌డీఎఫ్ దారుణంగా పడిపోయింది. మంగళవారం ఈ పదిమంది శాసనసభ్యులు భాజపాలో చేరారు. ఇక మిగిలింది పవన్‌ చామ్లింగ్‌, జీటీ ధుంగెల్‌‌, ప్రసాద్‌ శర్మ. వీరిలో ధుంగెల్‌, ప్రసాద్‌ శర్మ బుధవారం అధికార పార్టీ అయిన ఎస్‌కేఎంలో చేరారు. ఫలితంగా ఎస్​డీఎఫ్​ సంఖ్యా బలం శాసనసభలో 1కి పడిపోయింది.

AP Video Delivery Log - 1800 GMT News
Wednesday, 14 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1756: Archive US Blackwater Killings AP Clients Only 4225067
Ex-Blackwater contractor receives life sentence
AP-APTN-1740: Greece Fires AP Clients Only 4225068
Greek firefighters battle blaze on Evia Island
AP-APTN-1735: Hong Kong Protests AP Clients Only 4225045
Standoff between protesters and police in Hong Kong
AP-APTN-1725: Europe Open Arms AP Clients Only 4225066
Italian court rules against Salvini over migrant ship
AP-APTN-1717: Hong Kong Analyst AP Clients Only 4225064
Analyst on financial and economic effects of HK crisis
AP-APTN-1632: Hong Kong Police Officer Mandatory on-screen/on-air credit/AP Clients Only 4225060
Police officer in Hong Kong draws weapon in defence
AP-APTN-1606: Sweden ASAP Rocky Judge AP Clients Only 4225053
Judge comments after A$AP Rocky found guilty of assault
AP-APTN-1605: Sweden ASAP Rocky Lawyer No Access Sweden 4225052
A$AP Rocky found guilty of assault by Swedish court
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 1:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.