కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవ్జోత్ సింగ్ సిద్దూకు ఎన్నికల సంఘం మరోసారి సంజాయిషీ నోటీసులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చౌకబారు ఆరోపణలు చేసి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారని స్పష్టం చేసింది ఈసీ. ఈ షోకాజ్ నోటీసులపై ఒక్కరోజులోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
మధ్యప్రదేశ్లో ఏప్రిల్ 29న నిర్వహించిన ర్యాలీలో సిద్ధూ... ప్రధాని మోదీని తక్కువచేసి మాట్లాడారని, రఫేల్ అంశంలోనూ మోదీని విమర్శించారని రాష్ట్ర భాజపా విభాగం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. స్పందించిన అధికారులు.. ఆయనకు సంజాయిషీ నోటీసులు పంపించారు.
అంతకుముందూ సిద్ధూకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బిహార్ ఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు చేశారన్న కారణంతో.. 72 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉంచింది.
ఇదీ చూడండి: