అక్రమ మార్గాల్లో అధికారంలోకి రానుందని భాజపాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. నూతనంగా ఏర్పాటుకాబోయే ప్రభుత్వం రాజ్యాంగవ్యతిరేకమని, అనైతిక, అక్రమమని శాసనసభలో బలపరీక్ష ఓడిపోయిన అనంతరం వ్యాఖ్యానించారు.
"దొడ్డిదారిన భాజపా అధికారం లోకి వస్తోంది. వారికి ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదు. "
-సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేత
రాజ్యాంగ నిబంధనలకు లోబడే సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఎమ్మెల్యేల ఫిరాయింపుల ద్వారా భాజపా అధికారంలోకి రావాలని చూస్తోందన్నారు. వారికి ప్రజామోదం లేదని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్‌లకు 56 శాతం ఓట్లు వస్తే, భాజపాకు వచ్చినవి 36 శాతం మాత్రమేనన్నారు.
అధికారంలోకి రావడం కోసం రాజ్యాంగ నిబంధనలను భాజపా పక్కన పెట్టిందన్నారు. ఓటింగ్‌లో పాల్గొనని ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హులుగా ప్రకటించాలన్నారు.
ఇదీ చూడండి:సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా