కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవానికి బాధ్యత వహిస్తూ.. పార్టీ శాసనసభాపక్ష నేత పదవికి రాజీనామా చేశారు సిద్ధరామయ్య. శాసనసభ ప్రతిపక్ష నేతగానూ తప్పుకుంటున్నట్టు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వెల్లడించారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపినట్టు స్పష్టం చేశారు.
"కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ప్రజాస్వామ్య విలువలను సంరక్షించడం ఎంతో అవసరం. అందువల్ల పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీఎల్పీ పదవికి రాజీనామా చేస్తున్నా."
- సిద్ధరామయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత.
15 నియెజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో 12స్థానాల్లో బరిలో దిగింది కాంగ్రెస్. వీటిల్లో కేవలం రెండు సీట్లను దక్కించుకోగలిగింది.
సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడం వల్ల ఈ పోరును సిద్ధరామయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణించారు. కానీ ఫలితం దక్కలేదు.
ఇదీ చూడండి:- కన్నడనాట భాజపా పీఠం సుస్థిరం- జేడీఎస్ బేజారు