ETV Bharat / bharat

ప్రపంచంలో ఎత్తైన యుద్ధక్షేత్రానికి ఇక వెళ్లొచ్చు..

సియాచిన్​ను ఇక నుంచి పర్యటకులు సందర్శించవచ్చని తెలిపారు రక్షణ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​. ప్రపంచంలో ఎత్తైన యుద్ధక్షేత్ర  ప్రదేశంలో వ్యూహాత్మక వంతెనను ప్రారంభించారు.

author img

By

Published : Oct 21, 2019, 11:58 PM IST

ప్రపంచంలో ఎత్తైన యుద్ధక్షేత్రానికి పర్యటకులకు అనుమతి

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రమైన సియాచిన్‌ను పర్యటకుల సందర్శన కోసం తెరిచినట్లు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఇందుకోసం లద్ధాఖ్‌లో శ్యోక్‌ నది మీదుగా నిర్మించిన వ్యూహాత్మక వంతెనను భారత సైనికాధిపతి బిపిన్‌ రావత్‌తో కలసి రాజ్​నాథ్ ​ప్రారంభించారు. ఈ వంతెన శ్యోక్‌ నది నుంచి వెళ్తూ చైనా సరిహద్దు నియంత్రణ రేఖకు అనుసంధానంగా ఉండే బెగ్ ఓల్డీ సెక్టార్‌ను కలుపుతుంది.

‘లద్ధాఖ్‌లో మంచి పర్యటక ప్రదేశాలు ఉన్నాయి. పర్యటకులు అధిక సంఖ్యలో వచ్చేలా మార్గాలూ లద్ధాఖ్‌లో ఉన్నాయి. పర్యటకుల కోసం సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి కుమార్‌ పోస్ట్‌ వరకు మార్గాలను తెరిచాం’ అని ట్విట్టర్​లో తెలిపారు రాజ్​నాథ్​.

భారత సైన్యం 1970 నుంచి సియాచిన్‌కు పర్యటకులను అనుమతించి మళ్లీ 1984లో నిలిపివేసింది. 1984లో భారత్‌, పాక్‌ల మధ్య ఇక్కడ ఘర్షణలు జరిగాయి. అక్టోబర్‌ 31 నుంచి లద్ధాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించనున్న క్రమంలో సియాచిన్‌ ప్రారంభం కావడం విశేషం. ఇప్పటికే ఈ ఏడాది జూన్‌లో రాజ్‌నాథ్‌సింగ్‌ సైనికాధిపతి రావత్‌తో కలిసి సియాచిన్‌ వెళ్లి సైనికులతో మాట్లాడారు.

ఇదీ చూడండి: రామోజీరావుపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

Surat (Gujarat), Oct 21 (ANI): A home, a school and a playground for hundreds of underprivileged children, Vatsalyadham in Gujarat's Surat city is a perfect example of peaceful coexistence of different faiths and communities. Run by the Gajera group, that started it in 2006 with 56 children, it today accommodates more than 800 orphan students who both, study and live here. The brainchild of Vasant Gajera, Vatsalyadham provides accommodation and all the basic facilities to the children who are homeless and needy, irrespective of their race or religion. Spread across an area of 40 acres, the campus of Vatsalyadham is well equipped with all kinds of facilities like computer lab, library, playground, basketball court and hostel. Children are taught till 12th standard here and along with studies; much attention is also paid towards their overall development by involving them in several co-curricular activities including dance and music. By receiving training in the field of their choice at a younger age, children can look ahead towards their better future.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.