ETV Bharat / bharat

కొబ్బరి చిప్పలతో అబ్బురపరిచే కళాకృతులు

వాడిపడేసిన కొబ్బరి చిప్పలకు తన చేత్తో జీవం పోశాడు కర్ణాటకకు చెందిన ఓ కళాకారుడు. కేవలం కొబ్బరి చిప్పలతోనే దాదాపు 300 రకాల బొమ్మలను చెక్కేశాడు. బడిలో విద్యార్థులకు సైతం వినూత్న కొబ్బరి చిప్పల కళను నేర్పుతున్నాడు.

shivamurthy-bhat-makes-different-art-works-with-used-coconut-shells-in-uttara-kannada
'కొబ్బరి చిప్పలు' కళకళలాడేనట!
author img

By

Published : Sep 12, 2020, 1:46 PM IST

కొబ్బరికాయ భారతీయ సంస్కృతిలో ఓ భాగం. అనాదిగా పూజల్లో, వంటల్లో కొబ్బరికాయలను వినియోగిస్తూనే ఉన్నాం. అయితే, నీళ్లు తాగేసి, కొబ్బరి తినేసి.. మిగిలిన చిప్పలను చెత్త కుప్పల్లో పారేస్తాం. కానీ, కర్ణాటకకు చెందిన శివ మూర్తి భట్ మాత్రం వాడి పడేసిన కొబ్బరి చిప్పలతో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. పనికిరావనుకున్న చిప్పలకు తన హస్తకళతో జీవం పోస్తున్నాడు.

'కొబ్బరి చిప్పలు' కళకళలాడేనట!

ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన శివమూర్తికి చిన్నప్పటి నుంచి బొమ్మలు చెక్కడం అంటే మహా ఇష్టం. అతడి తండ్రి దేవుళ్ల విగ్రహాలను చెక్కేవాడు. దీంతో శివ కూడా నాన్నకు సాయం చేయడం మొదలు పెట్టాడు. ఆ మక్కువ తన అలవాటుగా మారింది. వృథాగా ఏ వస్తువు కనిపించినా.. వాటితో ఏ బొమ్మ చెక్కేద్దామా అని ఆలోచిస్తాడు. అలా తన చేతికి, ఓ సారి కొబ్బరి చిప్ప దొరికింది. ఇంకేముంది.. వాటితోనే బొమ్మలు చెక్కడం ప్రారంభించారు. ఇప్పటివరకు కొబ్బరి చిప్పలతో దాదాపు 300కు పైగా కళాకృతులను సృష్టించాడు శివ.

ShivaMurthy Bhat makes Different Art Works With Used Coconut Shells in uttara kannada
శివ చేతిలో కొబ్బరి చిప్ప స్ప్రింగు...

కొబ్బరి చిప్పలతో మొసలి, ఏనుగు, తల్లి-బిడ్డ, బంగాల్ మానిటర్, మనిషి ముఖం, కోతి, పక్షి, ఇలా అనేక రకాల కళాఖండాలను చెక్కాడు శివ. దేవతలు, జంతువులు, పక్షులు, కీటకాలు, ఫ్లవర్ పాట్.. ఇలా ఏదైనా ఇట్టే కొబ్బరి శిల్పకళగా కళకళలాడుతుంటాయి. ప్రస్తుతం ఓ ప్రైవేటు పాఠశాలలో ఆర్ట్ టీచర్​గా ఉద్యోగం చేస్తున్న శివ తన కొబ్బరి చిప్పల కళను విద్యార్థులకు కూడా నేర్పుతున్నాడు.

కొబ్బరికి ఎంత దర్జా...

కొబ్బరి చిప్ప కళ

కొబ్బరి కీటకాలివి...

ఇదీ చదవండి: ఒకేసారి నలుగురు బిడ్డలకు తల్లయింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.