ETV Bharat / bharat

'శివసేనకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది' - శివసేనకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై భాజపా- శివసేన మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. సేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేనకు 170 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఈ సంఖ్య 175కు కూడా పెరిగే అవకాశముందని ప్రకటించారు. మిత్రపక్షం భాజపాపైనా.. రౌత్​ తీవ్ర ఆరోపణలు చేశారు.

శివసేనకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు: సంజయ్ రౌత్
author img

By

Published : Nov 3, 2019, 12:41 PM IST

Updated : Nov 3, 2019, 5:26 PM IST

శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన వెల్లడించారు. ఈ సంఖ్య 175కు కూడా చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా-శివసేన మధ్య విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో సంజయ్ రౌత్​ వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అహంకారం అనే బురదలో

సంజయ్​ రౌత్ భాజపాపై పరోక్ష విమర్శలు చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అనే రథం ' (భాజపా)అహంకారం అనే బురద'లో చిక్కుకుందని ఆయన విమర్శించారు.
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించవచ్చన్న భాజపా నేతల వ్యాఖ్యలపైనా సంజయ్​ రౌత్​ మండిపడ్డారు. ఈ విషయంపై శివసేన పత్రిక సామ్నాలో 'రాష్ట్రపతిపాలనకు భాజపా సిద్ధపడడం అంటే అది ఆ పార్టీకి ఈ దశాబ్దంలోనే పెద్ద ఓటమి అవుతుంది' అని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి పీఠం కోసం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లలో విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠం విషయంలో ఇరుపార్టీల మధ్య భేదాభిప్రాయాలు పొడచూపాయి. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడలేదు.

ఇదీ చూడండి: '5 ట్రిలియన్​ డాలర్ల భారత్​ కల తొందరలోనే సాకారం'

Leh (Ladakh), Nov 03 (ANI): Attestation Parade was held on November 2 at the Ladakh Scouts Regimental Centre in Leh to mark the entry of 164 trained recruits into the Ladakh Scouts Regiment as Soldiers. Known as 'Snow Tigers' Ladakh Scouts Regiment specialises in mountain warfare.

Last Updated : Nov 3, 2019, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.