ETV Bharat / bharat

షిర్డీ సాయిబాబా భక్తులకు ఆన్‌లైన్‌ పాసులు

author img

By

Published : Jan 12, 2021, 5:10 AM IST

జనవరి 14నుంచి షిర్డీ వచ్చే భక్తులు ఆన్​లైన్​లోనే టికెబ్టు బుక్ చేసుకోవాలని ఆలయ ట్రస్టు తెలిపింది. గురువారాలు, వారాంతాలు, ముఖ్యమైన రోజులు, పబ్లిక్‌ సెలవు దినాల్లో రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఆలయ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని చెప్పింది.

Shirdi Temple Starts Online Pass System
షిర్డీ సాయిబాబా భక్తులకు ఆన్‌లైన్‌ పాసులు

కరోనా నేపథ్యంలో షిర్డీ సాయిబాబా ఆలయానికి వచ్చే భక్తులు దర్శనం, హారతి టికెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకోవాలని ఆలయ ట్రస్టు సూచించింది. ఈనెల 14నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని సాయిబాబా సంస్థాన్‌ వెల్లడించింది. ఆలయ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. దీనివల్ల గురువారాలు, వారాంతాలు, ముఖ్యమైన రోజులు, పబ్లిక్‌ సెలవు దినాల్లో రద్దీని నియంత్రించటం సాధ్యమవుతుందని సాయిబాబా సంస్థాన్‌ పేర్కొంది.

భక్తుల రద్దీ ఉండే దినాల్లో ఆలయ పరిసరాల్లో దర్శన, హారతి టికెట్లు జారీచేసే కౌంటర్లను మూసివేయనున్నట్లు సంస్థాన్ తెలిపింది.

ఇదీ చూడండి: కేంద్ర మంత్రి కారుకు ప్రమాదం- భార్య మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.