ETV Bharat / bharat

ప్రేమ కోసం షీలా.. రెండేళ్ల నిరీక్షణ - ఉమాశంకర్ దీక్షిత్

దేశ రాజధానికి సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసిన షీలా దీక్షిత్​.. ఆమె ప్రేమ కోసం రెండేళ్లు నిరీక్షించారట. సాధారణ కుటుంబంలో పుట్టి ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించటమే ఇందుకు కారణమని ఓ సందర్భంలో ఆమె చెప్పారు. ఆ ప్రేమకథ ఆమె మాటల్లోనే విందామా..

షీలా దీక్షిత్
author img

By

Published : Jul 21, 2019, 6:01 AM IST

అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్... తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు రెండేళ్ల పాటు ఎదురు చూశారట. సాధారణ కుటుంబంలో పుట్టిన షీలా ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించారు. అయితే కాబోయే అత్త అంగీకారం కోసం ఏకంగా రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. తన ప్రేమకథను ఒకానొక సందర్భంలో మీడియాతో పంచుకున్నారామె. అది ఆమె మాటల్లోనే..

"నేను ఎంఏ హిస్టరీ చదువుతున్న రోజుల్లో వినోద్‌ను మొదటిసారి చూశా. మా ఇద్దరిదీ ఒకే క్లాస్‌. తొలి చూపులోనే ప్రేమ అని చెప్పలేను గానీ వినోద్‌ చాలా చలాకీగా ఉండేవారు. అందరితో ఇట్టే కలిసిపోయేవారు. అయితే తనతో నాకు పెద్దగా పరిచయం లేదు. నా స్నేహితురాలు.. తన స్నేహితుడు ప్రేమించుకున్నారు. వారి మధ్య జరిగిన గొడవను పరిష్కరించే సమయంలో మేమిద్దరం మొదటిసారి కలుసుకున్నాం. వారి సమస్య పరిష్కారం కాలేదు గానీ, మేం మాత్రం మంచి స్నేహితులమయ్యాం.

రోజులు గడుస్తున్న కొద్దీ మా ఇద్దరి మధ్య స్నేహం బలపడుతూ వచ్చింది. నాది నెమ్మది స్వభావం. తనది దూకుడు మనస్తత్వం. ఆ విభిన్న ధ్రువాలే మమ్మల్ని దగ్గర చేశాయి. క్రమంగా తనకు నేను అన్ని చెప్పుకొనేంత దగ్గరయ్యాం. ఏ రోజూ మా మధ్య కుటుంబ విషయాలు రాలేదు.

ఆ మాట చెప్పినప్పుడు...

నాతో మాట్లాడేందుకు ఆయన నేను ఎక్కిన బస్సులోనే ఎక్కేవారు. ఫైనల్‌ పరీక్షలకు ఒక రోజు ముందు మేం ఇద్దరం బస్సులో వెళుతున్నాం. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి నాకు దొరికింది అని వాళ్ల అమ్మతో చెప్పాలనుకుంటున్నాని నాతో అన్నారు. మరి ఆ అమ్మాయి అభిప్రాయం కనుక్కున్నారా? అని తిరిగి ప్రశ్నించాను. దానికి ఆయన.. లేదు, కానీ తాను నా పక్కనే కూర్చుంది అని అన్నారు. అంతే నేను ఒక్కసారిగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను.

మా ఇంట్లో చెప్పేశాను..

రెండు రోజుల తర్వాత వినోద్‌ గురించి మా ఇంట్లో చెప్పాను. మా కుటుంబంలో కులమతాల పట్టింపులు లేవు. అయితే మేం ఇంకా జీవితంలో స్థిరపడకపోవడం వల్ల వారు ఒప్పుకోలేదు. కానీ మా మీద మాకు నమ్మకం ఉంది. అప్పటికే వినోద్‌ ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అవుతున్నారు.

ఆ తర్వాత చాలా కాలం పాటు మేం పెద్దగా కలుసుకోలేదు. మాట్లాడుకోలేదు. నేను చిన్న ఉద్యోగంలో చేరాను. వినోద్‌ ఐఏఎస్‌కు ఎంపికవడమేగాక దేశంలోనే 9వ ర్యాంక్‌ తెచ్చుకున్నారు. అప్పట్లో టాప్‌ 10 ర్యాంకర్ల పేర్లను రేడియోలో చెప్పేవారు. అది విన్న మా తల్లిదండ్రులు మా ప్రేమకు గర్వంగా పచ్చజెండా ఊపారు. అయితే ఇక ఒప్పించాల్సింది వినోద్‌ వాళ్లింట్లోనే.

వాళ్ల నాన్న చాలా మంచివారు

వినోద్‌ నాన్నగారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉమాశంకర్‌ దీక్షిత్‌. మాజీ ప్రధాని నెహ్రూకు అత్యంత సన్నిహితులు. పలుకుబడి ఉన్న బ్రాహ్మణ కుటుంబం. ఒకరోజు వినోద్‌ మా విషయాన్ని తన తండ్రితో చెప్పి నన్ను కలవమన్నారు. నేను భయంభయంగానే కలిశాను. ఆయన చాలా మంచివారు. నాతో ఎంతో ప్రేమగా మాట్లాడారు. ఆ తర్వాత మా అమ్మానాన్నలను కలిసి మా ప్రేమను అంగీకరించారు.

ఎన్నో ప్రయత్నాల ఫలితం

చిక్కంతా వినోద్​ తల్లిగారితోనే. కులాంతర వివాహానికి వినోద్‌ తల్లి ఒప్పుకోవడానికి కాస్త సమయం పడుతుందని.. అప్పటిదాకా ఆగాలని చెప్పారు మామయ్య. అది ఒక రోజు.. రెండు రోజులు.. రెండేళ్లు కూడా కావొచ్చన్నారు. అన్నట్లుగానే రెండేళ్లు గడిచింది. ఆ రెండేళ్లలో వాళ్ల అమ్మను ఒప్పించేందుకు వినోద్​, మామయ్య ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆమెకు నచ్చజెప్పారు. చివరకు ఆమె కూడా పచ్చజెండా ఊపగానే మా పెళ్లి రైలు పట్టాలెక్కింది.

SHEILA LOVE STORY
వినోద్​తో షీలా దీక్షిత్

రెండు వేర్వేరు సంప్రదాయాలు కలిగిన కుటుంబాలైనా సరే వాటన్నింటినీ పక్కనబెట్టి అంతా కలిసిపోయారు. 1962 జులై 11న మా పెళ్లికి ముహూర్తం పెట్టారు. మామయ్యగారికి ఆడంబరాలు నచ్చవు. అందుకే పెళ్లి చాలా నిరాడంబరంగా జరిపించారు. అలా నేను దీక్షిత్‌ ఇంట కోడలిగా అడుగుపెట్టా" అని ఆమె తన మధురజ్ఞాపకాలను పంచుకున్నారు.

ఇదీ చూడండి: 'ప్రజల గుండెల్లో షీలా చిరస్థాయిగా నిలుస్తారు'

AP Video Delivery Log - 1400 GMT News
Saturday, 20 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1353: Kosovo Haradinaj Reactions AP Clients Only 4221330
Analyst, residents on Haradinaj resignation
AP-APTN-1336: Internet Hunt Iran AP Clients Only 4221328
Hunt tweets: 'Iran may be choosing dangerous path'
AP-APTN-1220: Obit Dikshit AP Clients Only 4221323
Sheila Dikshit, former chief minister, dies
AP-APTN-1212: Italy Etna No access Italy 4221322
Etna erupts overnight, spewing lava and ash
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.