సాంకేతిక లోపం కారణంగా భారత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్-2 నిలిచిపోయింది. యావత్ భారత్ జాబిల్లి యాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూసింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు షార్ నుంచి ‘జీఎస్‌ఎల్వీ మార్క్3-ఎం1’ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లి ఉండాలి. అయితే ప్రయోగం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. తిరిగి ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపడతారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
మళ్లీ ఎప్పుడు..?
సాధారణంగా నిర్దిష్ట సమయం (లాంచ్ విండో)లోనే వ్యోమనౌకను ప్రయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో ప్రయోగించలేకపోతే మళ్లీ అనువైన సమయం వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే. ప్రస్తుత లాంచ్ విండో (సోమవారం తెల్లవారుజాము)లో ప్రయోగాన్ని పూర్తిచేసేందుకు ఇస్రో తీవ్రంగా శ్రమించినప్పటికీ నిరాశే ఎదురైంది. మళ్లీ ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు అనువుగా ఈ నెలలో కేవలం 1 నిమిషం నిడివి ఉన్న లాంచ్ విండోలే అందుబాటులో ఉన్నాయి. సోమవారం నాటి లాంచ్ విండో నిడివి 10 నిమిషాలు కావడం గమనార్హం. సాంకేతిక లోపాన్ని అధిగమించి...సమాలోచనలు జరిపి ఇస్రో మళ్లీ ప్రయోగ తేదీ ప్రకటించనుంది.
- ఇదీ చూడండి: సాంకేతిక లోపంతో చంద్రయాన్-2 నిలిపివేత