అధికార పార్టీ ఎంపీగా ఉంటూ సొంత పార్టీ నేతలనే విమర్శించడం భాజపా ఎంపీ శత్రుఘ్న సిన్హాకే చెల్లింది. 30 ఏళ్ల నుంచి భాజపాలో ఉన్న సిన్హా పార్టీని వీడి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. బిహార్ కాంగ్రెస్ నేతలతో కలిసి దిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.
ప్రజాదరణ కలిగిన శత్రుఘ్న సిన్హాను పార్టీ ప్రధాన ప్రచారకర్తగా నియమిస్తామని బిహార్ కాంగ్రెస్ ఇంఛార్జ్ శక్తిసింగ్ గోహిల్ తెలిపారు.
"నెహ్రూ, గాంధీ కుటుంబ నాయకులు సమర్థవంతమైన నేతలు. వారిపై నాకు ఎప్పుడూ మంచి అభిప్రాయమే ఉంది. వారు దేశ నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. భాజపాలో 30 ఏళ్లు ఉన్నా. ఇప్పుడు పార్టీని వీడుతున్నా. వారు ప్రజాస్వామ్యాన్ని విస్మరించారు. నియంతృత్వ ధోరణి కొనసాగుతోంది. దేశాన్ని నూతనంగా నిర్మించేందుకు, అభివృద్ధి పథంలో నడిపించేందుకు ధృడమైన యువనేత రాహుల్ గాంధీతో కలిసి ముందుకు సాగుతాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే పట్నా నుంచే పోటీ చేస్తా."
-శత్రుఘ్న సిన్హా