ETV Bharat / bharat

బిహార్ బరి: కాంగ్రెస్ గూటికి ఎల్​జేడీ చీఫ్​ కుమార్తె

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. ఎల్​జేడీ చీఫ్ శరద్ యాదవ్​ కుమార్తె శుభాషిణి కాంగ్రెస్​లో చేరారు. స్థానిక నాయకులు పార్టీ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు. మహాకూటమి విజయానికి తనవంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు.

Sharad Yadav's daughter Subhashini joins Congress ahead of Bihar polls
బిహార్ బరి: కాంగ్రెస్ గూటికి ఎల్​జేడీ ఛీఫ్​ కుమార్తె
author img

By

Published : Oct 14, 2020, 4:47 PM IST

లోక్​తాంత్రిక్ జనతాదళ్(ఎల్​జేడీ) చీఫ్ కుమార్తే శుభాషిణి.. కాంగ్రెస్​ పార్టీలో చేరారు. బిహార్​ అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో మహాకూటమికి మద్దతు తెలుపుతున్నట్లు ఆమె ప్రకటించారు. కాంగ్రెస్​ బిహార్ నాయకులు శుభాషిణికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

" నాకు ఈ అవకాశం కల్పించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు కృతజ్ఞతలు. మా నాన్న అనారోగ్యం కారణంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా లేరు. ఆయన మద్దతు మాత్రం ఎప్పుడూ మహాకూటమికే. ఎన్నికల్లో విజయం కోసం నా వంతు కృషి చేస్తా. "

-శుభాషిణి.

ఎల్​జేపీ నేత కాళి పాండే కూడా కాంగ్రెస్​లో చేరారు. రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్​కు మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఆయన.. సొంత ఇంటికి వచ్చినట్లు ఉందన్నారు. 1980లో బిహార్ విధానసభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు పాండే. 1984లో ఎంపీగా గెలుపొందారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.