ETV Bharat / bharat

బిహార్​ భాజపా శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్న షా

బిహార్​లో భాజపా శ్రేణులను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఆన్​లైన్​ ద్వారా ఆదివారం(మే7న) ప్రసంగించనున్నారు. అక్టోబర్​లో బిహార్​ ఎన్నికల నేపథ్యంలో షా ప్రసంగానికి ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. కరోనా నేపథ్యంలో రాజకీయాలు చేయటం సరికాదని విమర్శించారు బిహార్​ ప్రతిపక్ష నేత తేజస్వీ.

Shah's 'virtual rally' for people of Bihar on Sunday
బిహార్​ భాజపా శ్రేణులను ఉద్దేశించి షా ప్రసంగం
author img

By

Published : Jun 6, 2020, 7:15 PM IST

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం ఆన్‌లైన్‌ ద్వారా బిహార్‌లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో ప్రధాని మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సాధించిన విజయాలను షా.. ప్రజలకు వివరించనున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా అక్టోబర్‌, నవంబర్‌లో జరిగే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్‌ షా ఎక్కువ సేపు ప్రసంగించే అవకాశం ఉన్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.

బిహార్‌ వ్యాప్తంగా దాదాపు 72 వేల కేంద్రాల్లో అమిత్‌ షా ప్రసంగాన్ని ప్రసారం చేస్తామని భాజపా బిహార్‌ నేతలు తెలిపారు. మరోవైపు అమిత్‌ షా రాజకీయ ప్రసంగ కార్యక్రమాన్ని బిహార్‌ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ తప్పుబట్టారు. దేశంలో కరోనా సంక్షోభం నెలకొన్న వేళ.. ఎన్నికల కోసం ప్రచారం చేసుకోవడాన్ని రాజకీయంగా రాబందులను గుర్తుచేసేలా ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. మనుషుల ప్రాణాలు పోతున్నా... భాజపాకు మాత్రం ఎన్నికల్లో విజయం మాత్రమే కావాలని తేజస్వీ యాదవ్‌ ఆరోపించారు.

ఇదీ చూడండి: మొన్న ఏనుగు.. నేడు ఆవు.. అసలేమైంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.