ఈనెల 21న శాసనసభ ఎన్నికలు జరిగే హరియాణాలోని కైతల్‌లో ప్రచార సభలో పాల్గొన్నారు షా. రఫేల్, ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ నేతల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
" విజయదశమి రోజున మన దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రఫేల్ యుద్ధ విమానాన్ని భారత వాయుసేనలో చేర్చి దేశాన్ని మరింత శక్తిమంతం చేశారు. రఫేల్ పేరెత్తగానే రాహుల్ గాంధీకి కడుపులో నొప్పి పుడుతుంది. ఈ దేశ సైన్యానికి బలం ఎందుకు చేకూరాలని ఆయనకు అనిపిస్తుంది. అలాంటి రఫేల్‌కు ఆయుధ పూజ చేసి తమాషా చేయడం ఎందుకని అడిగారు. మీరు చెప్పండి, అసురులపై విజయం సాధించడానికి ఆయుధ పూజ చేయాలా వద్దా? ఇది మన దేశ సంస్కృతి. అవునా, కాదా? కాంగ్రెస్ అధికరణం 370 రద్దును అడ్డుకుంది. కానీ, భాజపా ఆ ఆర్టికల్‌ను రద్దు చేసేసింది."
-అమిత్ షా, భాజపా అధ్యక్షుడు
దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేసి, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అక్రమ వలసదారులు అందరినీ వెళ్లగొడతామని స్పష్టంచేశారు షా.