ETV Bharat / bharat

ఆపరేషన్​ దిల్లీ: కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం

దేశ రాజధాని దిల్లీలో కరోనా పరిస్థితిపై సమీక్షించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్​, లెఫ్టినెంట్ గవర్నర్, మేయర్లతో ఒక్కరోజే రెండు సార్లు సమావేశమయ్యారు కేంద్ర హొంమంత్రి అమిత్ షా. కరోనా పరీక్షల సంఖ్య రెట్టింపు, ఆస్పత్రుల సామర్థ్యం పెంపు, కాంటాక్ట్ ట్రేసింగ్​ ముమ్మరం వంటి చర్యలతో కరోనాను కట్టడి చేసేందుకు త్రిముఖ వ్యూహాన్ని సిద్ధం చేశారు.

Shah reviews COVID situation in meeting with Delhi mayors, commissioners of civic bodies
ఆపరేషన్​ దిల్లీ: కరోనా నియంత్రణకు అమిత్ షా చర్యలు
author img

By

Published : Jun 14, 2020, 7:48 PM IST

Updated : Jun 14, 2020, 8:37 PM IST

హస్తినలో మృత్యు కేళి సాగిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు నేరుగా రంగంలోకి దిగారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు సమన్వయంతో ముందుకు సాగి వైరస్​ వ్యాప్తిని నియంత్రించేలా విస్తృత ప్రణాళికలు సిద్ధం చేశారు. తక్షణం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వరుస భేటీలు

దిల్లీలో ప్రస్తుత పరిస్థితిపై విస్తృతంగా సమీక్షించారు షా. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్, లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్ బైజల్​, మేయర్లతో రెండు సార్లు సమావేశమయ్యారు. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. వైరస్​ను నిలువరించేందుకు దిల్లీ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశాల్లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ కూాాడా పాల్గొన్నారు.

పరీక్షల సామర్థ్యం రెట్టింపు..

దేశ రాజధానిలో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని రెండు రోజుల్లో రెట్టింపు చేయనున్నట్లు సమావేశాల అనంతరం అమిత్ షా తెలిపారు. ఆ తర్వాత టెస్టుల సామర్థ్యాన్ని మూడు రెట్లకు పెంచుతామన్నారు. ప్రతి కంటైన్​మెంట్​ జోన్​లో కరోనా టెస్టులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

దిల్లీలో చేపట్టబోయే చర్యలు..

  • కంటైన్​మెంట్ జోన్లలోని ప్రతి పోలింగ్​ స్టేషన్​లో కరోనా టెస్టులు.
  • హాట్​స్పాట్​లలో కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఇంటింటికి ఆరోగ్య సర్వే.
  • ఆస్పత్రులలో పడకల కొరత తీర్చేందుకు తక్షణమే వైద్య సదుపాయాలతో 500 రైల్వే బోగీల ఏర్పాటు.
  • ప్రైవేటు ఆస్పత్రులలో 60శాతం పడకలు అందుబాటులో ఉండేలా చర్యలు.
  • ప్రైవేటు ఆస్పత్రులో కరోనా పరీక్షలు, చికిత్సకు రేట్లు నిర్ణయించేందుకు వీకే పాల్​ నేతృత్వంలో కమిటీ.

అఖిల పక్ష భేటీ...

దిల్లీలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు అఖిల పక్ష భేటీకీ పిలుపునిచ్చారు అమిత్ షా. సోమవారం జరిగే ఈ సమావేశంలో పాల్గొనేందుకు భాజపా, కాంగ్రెస్, ఆప్​, బీఎస్పీలను ఆహ్వానించారు. మహమ్మారిని నిలువరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

దిల్లీలో కరోనా బాధితుల సంఖ్య దాదాపు 39 వేలకు చేరుకుంది. ఇప్పటి వరకు 1200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

Last Updated : Jun 14, 2020, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.