లైంగిక వేధింపుల పేరిట తప్పుడు కేసులో ప్రధాన న్యాయమూర్తిని ఇరికించేందుకు కుట్ర జరుగుతోందన్న న్యాయవాదికి సుప్రీంకోర్టు తాఖీదులు జారీచేసింది. సోమవారం సమర్పించిన ప్రమాణపత్రంలోని అంశాలపై మరింత స్పష్టత ఇవ్వాలని న్యాయవాది ఉత్సవ్ సింగ్ బైన్స్‌ను ఆదేశించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతతో ముడిపడి ఉన్న అతి ముఖ్యమైన కేసుగా ఈ అంశంపై బుధవారం ఉదయం పదిన్నరకు విచారణ చేపడతామని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది.
అఫిడవిట్లో ఏముందంటే...
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయిపై వచ్చిన ఆరోపణలు కుట్రపూరితమని న్యాయవాది ఉత్సవ్ సింగ్ సోమవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగి పట్ల వాదించడం సహా దిల్లీలోని ప్రెస్ క్లబ్లో సీజేఐకు వ్యతిరేకంగా పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేస్తే కోటిన్నర రూపాయలు ఇస్తానని కొందరు తనను సంప్రదించినట్లు ప్రమాణపత్రంలో పేర్కొన్నారు.
ఉత్సవ్ సింగ్ అఫిడవిట్‌పై బుధవారం విచారణ జరగనుంది.
ఇదీ చూడండీ: 'తీవ్రవాదులకు ఐఈడీ- మనకు ఓటర్ ఐడీ'