ETV Bharat / bharat

'సోషల్​ వేధింపుల'పై రాజకీయ కాక - రాజకీయ దుమారం

తమిళనాడులో సామాజిక మాధ్యమాల ద్వారా యువతులను వేధించిన వ్యవహారం... రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైన ఈ కేసును విపక్ష నేతలు విమర్శనాస్త్రంగా మలుచుకున్నారు.

'సోషల్​ వేధింపుల'పై రాజకీయ కాక
author img

By

Published : Mar 12, 2019, 8:55 PM IST

సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలు వహించకపోతే కలిగే అనర్థాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఓ సంఘటన తెలియచెబుతోంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మందికిపైగా యువతులను నలుగురు యువకులు ఫేస్​బుక్​ ద్వారా పరిచయం చేసుకొని లైంగికంగా వేధించిన ఘటన తమిళనాడులో సంచలనంగా మారింది.

మహిళకు రాష్ట్రంలో రక్షణ కరవైందంటూ ప్రతిపక్షాలు అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

దీనిపై "#పొల్లాచ్చి లైంగిక వేధింపులు" పేరుతో ట్విటర్​లో ఓ ఖాతా తెరిచారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన శిక్షలు వేయాలని కోరుతున్నారు తమిళనాడు వాసులు.

విషయం బయటికొచ్చిందిలా..

కోయంబత్తూరుకు సమీపంలోని పొల్లాచ్చి పట్టణంలో​ నివాసముంటున్న నలుగురు యువకులు 19 ఏళ్ల యువతిని లైంగిక వేధిస్తూ వీడియో తీశారు. దీనిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. ఈ విషయాన్ని ఆ యువతి కుటుంబసభ్యులకు తెలిపింది. ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. విచారణలో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి.

నమ్మించి.. మోసగించి.. బెదిరించి

పొల్లాచ్చికి చెందిన 19 ఏళ్ల యువతికి అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల పాటు వీరి స్నేహం సాగింది. ఒక రోజు వీరిద్దరూ కలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. కళాశాల పూర్తవగానే యువతిని కారులో ఎక్కించుకుని బయల్దేరాడు యువకుడు. దారిలో మరో ముగ్గురు కారు ఎక్కారు. వీరు నలుగురు కలిసి యువతిని కారులో వేధించారు. దీనిని చరవాణిలో చిత్రీకరించారు. తాము పిలిచినప్పుడు రాకపోయినా, అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోయినా వీడియో సామాజిక మాధ్యమాల్లో పెడతామని యువతిని బెదిరించారు.

ఇంటికి చేరుకున్న యువతి... సోదరుడికి విషయం చెప్పింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు శబరి, వసంత కుమార్​, సతీష్​ కుమార్​లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న తిరువునాక్కరసును గత వారం తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. రెండు వారాల పాటు వీరిని విచారించారు పోలీసులు. వీరి చరవాణులను పరిశీలించగా సుమారు 50 మందికి సంబంధించిన యువతుల అశ్లీల వీడియోలు ఉండటం పోలీసులను ఆశ్చర్యపరిచింది. ఫేస్​బుక్​ స్నేహం పేరుతో మహిళలతో పరిచయం పెంచుకోవటం, తర్వాత వారిని నిర్జన ప్రదేశాలకు తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడుతూ, వీడియోలు చిత్రీకరించి వారిని బెదిరించడమే​ ఈ ముఠా పనిగా గుర్తించారు పోలీసులు.

పరువుపోతుందనే..

పరువు పోతుందనే భయమే ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడానికి కారణమని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు ధైర్యం చెప్పటం వల్ల నలుగురు మహిళలు తమను ఎలా వేధించారో పోలీసులకు వివరించినట్లు సమాచారం.

ప్రముఖుల హస్తం

గత వారం పోలీసులకు పట్టుబడిన తిరువునాక్కరసు ఈ కేసులో ప్రముఖులపాత్ర ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటం... తమిళనాడులో కలకలం రేపుతోంది. అన్నాడీఎంకే పార్టీ నాయకుడు నాగరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేసు వెనక్కి తీసుకోవాల్సిందిగా బాధితురాలి అన్నను నాగరాజు బెదిరించినట్లు సమాచారం. నాగరాజును పార్టీ నుంచి బహిష్కరించినట్లు, ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసినట్లు అన్నాడీఎంకే ప్రకటన విడుదల చేసింది.

ఆ నలుగురి వల్ల మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ జయరాం పేర్కొన్నారు. మహిళా వేధింపుల చట్టం కింద వీరిపై కేసు నమోదు చేశారు. విచారణను పారదర్శకంగా జరుపుతామని పోలీసులు తెలిపారు.

రాజకీయ దుమారం

ప్రస్తుతం ఈ వివాదం తమిళనాడులో రాజకీయ కాక సృష్టిస్తోంది. నిందితులను రక్షించేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్​ ఆరోపించారు. స్టాలిన్​ సోదరి, లోక్​సభ సభ్యురాలు కణిమొళి బాధితుల తరఫున పోరాడతానని ప్రకటించారు.

ఈ కేసును సీబీ-సీఐడీకి అప్పగించినట్టు తెలిపారు తమిళనాడు డీజీపీ రాజేంద్రన్​.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Middle East and North Africa. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Jalan Besar Stadium, Singapore - 12th March 2019
1. 00:00 walkout and handshake, Tampines Rovers (yellow), Hanoi FC (white)
First Half
2. 00:15 CHANCE HANOI, 18th minute, header missed wide by (90) Ganiyu Osen
3. 00:28 CHANCE HANOI, 28th minute, shot by (10) Nguyen Van Quyet saved by Tampines goalkeeper Muhammad Syazwan from cross by (20) Pape Omar Faye
4. 00:39 CHANCE TAMPINES, 30th minute, (16) Daniel Bennett heads ball off post from corner kick
5. 00:46 replays
Second Half
6. 00:53 CHANCE HANOI, 61st minute, shot by (29)  Ngan Van Dai saved byTampines goalkeeper Muhammad Syazwan  
7. 01:06 GOAL HANOI, 62nd minute by (20) Pape Omar Faye from a corner kick, 1-0 Hanoi FC
8. 01:19 replays of goal
9. 01:33 GOAL TAMPINES, 77th minute by (10) Jordan Webb, 1-1
10. 02:02 replays of goal
SOURCE: Lagardere Sports
DURATION: 02:20
STORYLINE:
Jordan Webb equalised in the 77th minute to give Singapore Premier League side Tampines Rovers a 1-1 draw at home with Vietnam's Hanoi FC in an AFC Cup Group F match on Tuesday.
Hanoi FC took the lead through Pape Omar Fay from a corner in 62nd minute before Webb scored off a breakaway to level as the hosts clawed back a point.
Tampines and Hanoi FC sit tied atop the Group F tables with four points after two matches played, followed by Cambodia's Naga World, which defeated winless Yangon United of Myanmar for its first AFC Cup win in club history on Tuesday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.