హిమాచల్ ప్రదేశ్లోని కుఫ్రీ, నార్కంద, కిన్నౌర్, ఖరపాథర్ ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జన జీవనం స్తంభించింది.
విపరీతంగా కురుస్తోన్న మంచు కారణంగా పంజాబ్ ఫిరోజ్‌పుర్‌ను చైనా-ఇండియన్ సరిహద్దును కలిపే ద షిప్కి లా జాతీయ రహదారి(ఎన్హెచ్-5)ని మూసివేశారు అధికారులు. నార్కంద, ఖరపాథర్ల ప్రాంతాల్లో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు.
మంచు విపరీతంగా కురుస్తున్న కారణంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పడిపోతున్నాయి. స్థానికులు, పర్యటకులు చలికి గజగజలాడుతున్నారు.




ఇదీ చూడండి:ఏనుగుని కాల్చాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు!